తెలంగాణ రాష్ట్ర సాధనలో చిరస్మరణీయమైన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ డెబ్బయి ఒక్కేండ్ల బక్కపలుచని నాయకుడిది నాలుగు దశాబ్దాలకు పైగా విరామమెరుగని రాజకీయ చరిత్ర. విశాలాంధ్రలో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై పోరాటానికి ఆయన 2001లో రణ నినాదం చేశారు. పదమూడేండ్లపాటు వివిధ వ్యూహాలతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. ఆ ప్రస్థానాన్ని అవలోకనం చేసుకుందాం.