అమెరికాలోని తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా).. విశ్వనాథ అచ్యుత దేవరాయలు, శర్మ ఇంద్రగంటి తదితరుల నేతృత్వంలో తెలుగు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నది. వాటిలో భాగంగా కథలు, కవితలు, నాటికల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎంపికైన రచనలను తమ సొంత వెబ్సైట్ సంచిక ‘సంగతి’లో పొందుపరుస్తారు. ఆ కథలు తెలుగు పాఠకులకు చేరాలనే రచయితల కోరిక మేరకు అన్వీక్షకి ప్రచురణ సంస్థ చొరవతో ‘సంగతి’ పేరిట పుస్తకాలుగా తీసుకొచ్చారు. తాజా సంకలనం ‘సంగతి-2’లో ఈ పోటీల్లో ఎంపికైన 16 కథలున్నాయి. వేటికవే ప్రత్యేకం. ఇందులో వసుంధర, సలీం, సుంకోజి దేవేంద్రాచారి, ఎం.సుగుణరావు, ఉమామహేష్ ఆచాళ్ల లాంటి సీనియర్ కథా రచయితలతోపాటు గాజోజు నాగభూషణం, బాడిశ హనుమంతరావు, నస్రీన్ ఖాన్ తదితర యువ కలాల రచనలు కూడా ఉన్నాయి.
ఉయ్యూరు అనసూయ కథ ‘అంగన’ ట్రాన్స్జెండర్స్ వ్యక్తిగత సంఘర్షణ, బెంగతో మొదలైనా కుటుంబం, సమాజం నుంచి ఛీత్కారాలు కాకుండా వైద్యపరంగా శరీర మార్పులు సూచించడంతో ఆ పాత్రపట్ల సానుభూతి, గౌరవం కలుగుతాయి. కోర్టు మరణ శిక్షలను అమలు చేసే తలారి జీవితాల్లోని మానసిక వేదనను బి. నర్సన్ రాసిన ‘ఈ శిక్ష మాకొద్దు’ కథలో చూడొచ్చు. ‘సంగతి-2’ సంకలనంలోని కథలన్నీ భిన్నమైన ఇతివృత్తం, తమదైన శైలి, శిల్పం కలిగినవే. తెలుగు కథలు ప్రచురించే పత్రికలు తగ్గిపోయిన సమయంలో అమెరికా నుంచి కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు కథను పోషిస్తున్న తెల్సా కృషి అభినందనీయం.
పేజీలు: 225, ధర: రూ. 225
ప్రచురణ: అన్వీక్షకి ప్రచురణ
ప్రతులకు: ఫోన్: 97059 72222
…? సుశిక్షిత్
రచన: ఎమ్మెస్వీ గంగరాజు
పేజీలు: 84,
ధర: రూ. 80
ప్రచురణ: జె.వి.పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 73815 35677
రచన: విజయానంద్ దెందులూరి
పేజీలు: 243,
ధర: రూ. 150
ప్రచురణ: జె.వి.పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 99080 66339
రచన: అనంతుల సత్యనారాయణ
పేజీలు: 41, ధర: రూ. 50
ప్రతులకు: ఫోన్: 96764 86718