కావలసిన పదార్థాలు :
పడ్ థాయ్ నూడుల్స్ లేదా మామూలు నూడుల్స్ : రెండు కప్పులు బీన్స్, క్యారట్, క్యాబేజీ, క్యాప్సికమ్ : అన్నీ సమపాళ్లలో (ఒక కప్పు ముక్కలకు సరిపడా)
నూనె : ఒక టేబుల్ స్పూన్
చిల్లీ ఫ్లేక్స్ : 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి : పది రెబ్బలు
కార్న్‌ఫ్లోర్ : రెండు పెద్ద చెంచాలు
వెనిగర్ : 1 టేబుల్ స్పూన్
నీళ్లు : ఒక కప్పు
పంచదార: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
తయారీ విధానం : ముందుగా నూడుల్స్‌ను ఉడికించి నూనె పట్టించి పక్కన పెట్టుకోవాలి. క్యారట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను సన్నగా, పొడవుగా తరగాలి. నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి జోడించాలి. ఈ మొత్తాన్నీ రవంత నూనె వేసి హై ఫ్లేమ్‌లో మోస్తరుగా ఉడకనిచ్చి పక్కన ఉంచుకోవాలి. మరోవైపు తెరియాకి సాస్‌ను తయారు చేసుకోవాలి. అందుకోసం చిల్లీఫ్లేక్స్, సన్నగా తరిగిన వెల్లుల్లి, వెనిగర్, ఉప్పు, పంచదారలను నీళ్లకు కలపాలి. పొయ్యి మీద పెట్టి తిప్పుతూ కార్న్‌ఫ్లోర్‌ను వేసి ద్రావణం కాస్త చిక్కగా సాస్‌లా తయారయ్యాక పొయ్యి ఆపేయాలి. ఉడికించి పెట్టుకున్న నూడుల్స్‌కి ఈ తెరియాకి సాస్నూ, కూరగాయల్నీ కలిపేస్తే… తెరియాకి నూడుల్స్ సిద్ధమైనట్లే!