Heart attack | ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (ఏఎమ్ఐ)… ఒక్కమాటలో గుండెపోటు! రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్తప్రసరణ తగ్గిపోయి, మనిషిని మరణం అంచుల వరకూ చేర్చే సమస్య. ఈ సమస్య ఫలానావారికే రావాలని లేదు. కాకపోతే రక్తపోటు సమస్య, పొగతాగే అలవాటు.. ఈ ప్రమాదానికి త్వరగా దారితీస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే!
కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆడవాళ్లు, మగవాళ్ల విషయంలో భిన్నంగా పనిచేస్తాయా? అనే అనుమానం వచ్చింది యేల్ విశ్వవిద్యాలయం పరిశోధకులకు. ఇందుకోసం యాభై అయిదేండ్లలోపు వయసు కలిగిన అయిదువేల మందికి పైగా మహిళల వైద్య చరిత్రను, జీవనశైలిని పరిశీలించారు. వీరిలో సగం మంది గుండెపోటు వచ్చినవారైతే.. మిగతావారు ఆరోగ్యవంతులు. మధుమేహం, కుంగుబాటు, అధిక రక్తపోటు, ధూమపానం, వంశపారంపర్యం, పేదరికం, కొలెస్ట్రాల్… అనే ఏడు లక్షణాలు ఏఎమ్ఐకి దారితీస్తున్నాయని తేలింది. అవే లక్షణాలు ఉన్న మగవారితో పోలిస్తే, తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్టు తేలింది. కాబట్టి వైద్యులు ఇకమీదట ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలని సూచిస్తున్నారు.
“హృద్రోగులకు ఊరటనిచ్చే వార్త.. గుండె కండరాలకు పునరుజ్జీవం”
“Drinking Water | నీళ్లు తక్కువగా తాగితే గుండె జబ్బులు వస్తాయా?”
“ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే మీ గుండెకు డేంజర్ బెల్ మోగినట్టే !!”
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?”