తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎన్నో మలుపులు, ఎన్నో దశలను దాటుకుని విజయతీరాలను చేరుకున్నది. ఈ ప్రయాణం అనేక వైరుధ్యాలు, సంఘర్షణలు, త్యాగాల సమాహారం. వీటన్నిటినీ జీవితంలో భాగంగా చిత్రించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన రచయిత, సామాజిక తత్వవేత్త బి.ఎస్.రాములు ‘కొత్త కోరికలు’ రూపంలో ఒక సంకలనంగా తీసుకొచ్చారు. ఇందులో ఉన్న 16 కథలూ ఆధునిక జీవిత నేపథ్యాన్ని కలిగినవి కావడం విశేషం. మొదటి కథ ‘కొత్త కోరికలు’ పెద్దగా కోరికలంటూ ఏమీ లేకుండానే బాల్యం నుంచి నడివయసు వరకు ఎప్పటికప్పుడు కొత్త కోరికలు పుట్టుకొస్తున్న సగటు మనిషి సత్యం అంతరంగాన్ని పట్టిచూపుతుంది. ఇందులో ప్రధాన పాత్ర సత్యం ఆధునిక మధ్య తరగతి మనిషికి ప్రతిరూపం. ఇక ‘చెదిరిన కల’ కథ ఉరివేసుకున్న వ్యక్తి గురించి కథకుడి అంతరంగాన్ని వివరిస్తుంది. ఎవరికీ అక్కర లేని ప్రేమికుడి అంతరంగాన్ని ‘చేప’ కథ చిత్రిస్తుంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత గురుకులాల స్థాపనతో విద్యా ప్రమాణాలు మెరుగవుతున్న క్రమాన్ని ‘గురుకులం’ కండ్లకు కడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం జరుగుబాటు కాకపోవడంతో రైతుల ఆత్మహత్యల ఇతివృత్తంతో సాగుతుంది ‘ఓయూ క్యాంపస్’ కథ. ఇందులో తెలంగాణ ఉద్యమ క్రమాన్ని రచయిత కండ్లకుకట్టారు. స్వరాష్ట్రం సిద్ధించడంతో పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలకు పట్టంకట్టిన వైనాన్ని ‘కొత్త కొత్త’ కథ వివరిస్తుంది. కాగా, మనిషి జీవితంలో డబ్బు చేసే మాయాజాలాన్ని, అత్యాశకుపోతే బతుకు బజారున పడే పరిస్థితుల్ని ‘ద్రవ్యం’ విడమరుస్తుంది.
రచన: బి.ఎస్.రాములు
పేజీలు: 176, ధర: రూ. 150
ప్రచురణ: విశాల సాహితీ ప్రచురణ
ప్రతులకు: ఫోన్: 83319 66987
నిబద్ధత కలిగిన తొలితరం ఆధునిక భారత ఇంజినీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అందుకే ఆ దార్శనికుడి జన్మదినం సెప్టెంబర్ 15ను భారతదేశంలో ఇంజినీర్ల దినంగా జరుపుకొంటున్నాం. తెలంగాణకు సంబంధించినంత వరకు ఆయన హైదరాబాద్ నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థకు రూపకల్పన చేశారు. మూసీ నదికి 1908లో వచ్చిన వరదలు హైదరాబాద్ నగరానికి ఓ పీడకలగా గుర్తుండిపోయాయి. ఆ నేపథ్యంలో భవిష్యత్తులో నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు మూసీ, ఈసీ నదులపై రెండు జలాశయాలు నిర్మించాలని సూచించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు అలా రూపుదిద్దుకున్నవే. పూనా సైన్స్ కాలేజీ నుంచి 1883లో సివిల్ ఇంజినీరింగ్ పట్టా అందుకున్న విశ్వేశ్వరయ్య వృత్తి జీవితం బొంబాయి ప్రెసిడెన్సీ, మైసూరు సంస్థానాల్లో గడచిపోయింది. ఉద్యోగ విరమణ తర్వాత మైసూరు దివాన్‌గా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంతేకాదు ఆధునిక భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు ఆర్థిక విధానాలు రూపొందించుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన విశ్వేశ్వరయ్య ఇంజినీర్‌గా తన అనుభవాలను ‘Memoirs of My Working Life’ పేరుతో అక్షరబద్ధం చేశారు. ఆ ఆంగ్ల రచనకు ‘నా వృత్తి జీవితం: అను భవాలు’ పేరుతో శ్రీధర్‌రావు దేశ్‌పాండే తెలుగు అనువాదం తీసుకువచ్చారు. ఆధునిక భారతదేశ నిర్మాణం ఎలా మొదలైందో తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది.

నా వృత్తి జీవితం : అనుభవాలు
రచన: మోక్షగుండం విశ్వేశ్వరయ్య
అనువాదం: శ్రీధర్‌రావు దేశ్‌పాండే
పేజీలు: 186, ధర: రూ. 200
ప్రచురణ: తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం
ప్రతులకు: ఫోన్: 92474 71361
రచన: డా.సి.నారాయణరెడ్డి
పేజీలు: 98, ధర: అముద్రితం
ప్రచురణ: సమన్విత్ క్రియేషన్స్
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్,
నవచేతన పబ్లిషింగ్ హౌస్

రచన: ఉమాదేవి ఇల్లెందుల
పేజీలు: 328, ధర: రూ. 200
ప్రచురణ: జె.వి.పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 98495 64591

రచన: రమా శాండిల్య
పేజీలు: 120, ధర: రూ. 150
ప్రచురణ: జె.వి.పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 80963 10140

రచన: శివరామకృష్ణ ఆకుల
పేజీలు: 89, ధర: రూ. 80
ప్రచురణ: నవజ్యోతి పబ్లిషర్స్
ప్రతులకు: ఫోన్: 99486 61935

రచన: కొమురవెల్లి అంజయ్య
పేజీలు: 72, ధర: రూ. 50
ప్రచురణ: జైత్ర పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 99895 28112

రచన: సీతారాం ఏచూరి, ప్రభాత్ పట్నాయక్ తదితరులు
పేజీలు: 104, ధర: రూ. 100
ప్రచురణ: నవ తెలంగాణ
పబ్లిషింగ్ హౌస్
ప్రతులకు: ఫోన్: 94900 99378

రచన: గోసుల శ్రీనివాస్ యాదవ్
పేజీలు: 276, ధర: రూ. 666
ప్రచురణ: గొంగడి ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 98498 16817

ఉద్యమ నేత.. సంక్షేమ ప్రదాత తెలుగుప్రభ దినపత్రికలో వ్యాసాలు
పేజీలు: 122, ధర: రూ. 150
ప్రచురణ: శ్రీ జనచైతన్య పబ్లికేషన్స్