శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 02:13:16

అంతా ‘ఇ-స్మార్ట్‌'

అంతా ‘ఇ-స్మార్ట్‌'

చదువు

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నెలలుగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ వచ్చాయి. ఇదే తరుణంలో విద్యార్థుల చదువులు ఆగిపోకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ క్లాసులను మొదలు పెట్టారు. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ సెల్‌ఫోన్‌ ద్వారా పాఠాలు వింటున్నారు. విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధక విద్యార్థులు సైతం ఆన్‌లైన్‌ (గూగుల్‌ మీట్‌, జియో మీట్‌) ద్వారానే వైవాను పూర్తి చేస్తున్నారు. కొన్ని యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లోనే పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి.

ఇంటర్వ్యూలు

ప్రైవేటు కంపెనీల ఇంటర్వ్యూలు అనగానే గతంలో గంట ముందే ఆఫీసులకు వాలిపోయేవారు నిరుద్యోగులు. మనిషి ఎదుట ఉండడంతోనే కంపెనీ ప్రతినిధులు అన్ని రకాల ప్రశ్నలతోపాటు బాడీలాంగ్వేజ్‌ను కూడా పరిశీలించేవారు. కానీ ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అదే విధంగా టీవీ, సినిమా తదితర ఇంటర్వ్యూలు, చర్చలు సైతం ఆన్‌లైన్‌ ద్వారానే కొనసాగిస్తున్నారు.

పెండ్లిళ్లు...


పెండ్లి అనగానే కుటుంబసభ్యులు, బంధువులతో వధూవరుల ఊరంతా సందడిగా ఉండేది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అవన్నీ మటుమాయం అయ్యాయి. కొద్దిమంది సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. దీనిపై కూడా టెక్నాలజీ కన్ను పడింది. దూరంగా ఉంటూనే పెండ్లి చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంతకుముందు పెండ్లి పిలుపునకు బంధువులకు ఆహ్వానపత్రికలు పంపేవారు ప్రస్తుతం వారి స్మార్ట్‌ ఫోన్లకు లైవ్‌స్ట్రీమింగ్‌ లింక్‌ను పంపి ఆన్‌లైన్‌లోనే బంధువుల ఆశీర్వదాలను పొందుతున్నారు.