ఖలీల్‌వాడి, ఏప్రిల్ 23: నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం మరో 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. బహుజన్ లెఫ్ట్ పార్టీ అభ్యర్థి అశోక్‌గౌడ్ అబ్బగోని, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ అభ్యర్థి పోతు నవీన్, ప్రజాసేన పార్టీ అభ్యర్థి పోతు నాగరాజు, ఆలిండియా నేషనల్ పార్టీ అభ్యర్థి ఎండీ షాహెద్ఖాన్, దళిత బహుజన పార్టీ అభ్యర్థి గోలి నరేశ్ నామినేషన్లు సమర్పించారని వివరించారు.
స్వతంత్ర అభ్యర్థులుగా కొత్తకొండ శక్తిప్రసా ద్, బీబీనాయక్, మహ్మద్ జమీల్, జి.సాయికృష్ణ మూర్తి నామినేషన్లు వేశారన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు రాపెల్లి సత్యనారాయణ, రాపెల్లి శ్రీనివాస్‌తో పా టు ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కండెల సుమన్ కూడా మరో సెట్ పత్రాలు దాఖలు చేశారన్నారు. వీరితో పాటు అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ అభ్యర్థి యుగంధర్ గట్ల, యుగ తులసి పార్టీ అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్, విద్యార్థులు రాజకీయ పార్టీ అభ్యర్థి భూక్య నందు, స్వతంత్ర అభ్యర్థిగా కాట్రాజి ప్రశాంత్ మరో సెట్ నామినేషన్లు వేశారని వివరించారు. ఇప్పటిదాకా 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.