Children Stories | ఎన్కట ఒక ఊర్లె ఒక పిలగాడు ఉండెటోడు. ఆని పేరు జగను. ఆనికి అయినోల్లంట ఎవ్వలు లేరు. పని దొరికితే శేసుకునుడు, దినుడు. దొరకన్నాడు శెర్ల నీళ్లు దాగి పండుడు. గంతే! అప్పుడప్పుడు అంట జేసుకొని దింటుండె. ఒకపారి అంట జేసుకుందామని పొయ్యికాడికి వొయ్యేటాల్లకు పొయ్యిల కట్టెలు మాయమైనయి. కట్టెలు దెచ్చుకుందమని గొడ్డలి వట్టుకొని జంగల్కు వోయిండు. ఆ యాళ్ల కొన్ని కట్టెలు ఎక్వ గొట్టుకున్నడు. జరంత ఆల్శమైంది. మోపెత్తుకొని వోతుంటె.. ఆగుకాడ నీళ్లల్ల ఆడుకుంటున్న అచ్చరసలు కనిపిచ్చిండ్లు. మెల్లగ వోయి అండ్ల ఒకామె ఓనిని తీసుకొని మోపుల దాశివెట్టిండు.
అంతట్లకే పొద్దుగుంకె వరకు ఆల్లు జల్దిజల్ది ఆల్ల లోకంలకు వోయెతందుకు తయారు గావట్టిండ్లు. ఈడు ఒక ఓని దాశివెట్టె గదా! అందరు వోయిండ్లు గని.. ఆఖరామెకు ఓని లేకపోవుట్ల మొగులుమీదికి ఎగురరాలే! ఆమె అటీటు జూత్తుంటె.. ఈడు మందలిచ్చి, ముచ్చట అర్సుకొని ఇంటికి దోల్కవోయిండు. కొన్నొద్దులకు ఆల్లిద్దరు లగ్గం సుత జేసుకున్నరు. ఒకపారి సాయిమాను సదుర్తుంటె అచ్చరసకు ఆమె ఓని గనిపిచ్చింది. ముచ్చటంత ఎరికైంది. జగను రాంగనే.. ఇయ్యరమయ్యర తిట్టి, మొగులు మీదికి ఎగిరిపేయింది. ఏడ్శిఏడ్శి జగను పిసోడైండు. ఆని గోస సూడలేక.. “ఎయ్యి మంచి పనులు జేత్తె.. మా లోకంలకు దోల్కవోత!” అంట జెప్పింది అచ్చరస. ఆడు గట్లనే జేసిండు. ఈమె గూడ ఆన్ని ఆల్ల లోకంలకు దోల్కవోయింది. ఆల్ల లోకంల దోసకాయ దింటె అరదలత్తయి. అది దెల్వక మనోడు దూపై దోసకాయ దిన్నడు. ఎంబటే.. అరదలచ్చి అందరు నపరోదిక్కు కొట్టుకవోయిండ్లు. అట్ల ఈల్లిద్దరు శెరోదిక్కు వోయిండ్లు. మనకు మొగులు మీద గనిపిచ్చే ‘ఛాయాపథం’ సుక్కలు ఈల్లిద్దరేనుల్లా!
పత్తిపాక మోహన్
Children Stories | అయ్యో పాపం అని జాలి చూపిస్తే రాజుకే సుక్కలు చూపిచ్చిండు!
Children Stories | అన్ని తెలిసినోడు ఈ దునియాల ఎవ్వలుంటరు?
Children Stories | బీర్బల్తో మజాక్ చేయబోతే అక్బర్కే రివర్స్ తగిలింది!
Children Stories | మొగులు మీద సుక్కలకు.. ఆవాలకు మస్త్ లింకు పెట్టిన బీర్బల్!
Children Stories | అరశేతుల ఎంటికలు ఎందుకు మొలవవో గమ్మతిగా జెప్పిన బీర్బల్