Children Stories | పెండ్లం మాట విని అన్న మీదికి లొల్లికి పోయిన తమ్ముడు.. బీర్బల్ భలే బుద్ధి చెప్పాడుగా..
Children Stories | ఓనాడు భీముడు.. పిల్లగాండ్లకు ఇద్దామని పొద్దుగాల్నే శెట్టు కాయలు తెంపవట్టిండు. అంతట్లకే రాముని పెండ్లాం సూశి ఉరుక్కుంట ఇంట్లకు వోయి.. “మీ అన్న మాడికాయలు దెంపుతాండు! మనకెట్ల?” అంట ఆన్ని ఏగేశింది.
Children Stories | పిల్లగాండ్లూ! మీకు అక్బర్, బీర్బల్ గురించి ఎరుకే గదా! మన మర్యాద రామన్న లెక్క.. ఎంత మతలబున్న ముచ్చటైనా, ఒక క్షణంల ఖుల్లం ఖుల్ల జేసి తప్ష జేత్తడని పేరు. నా శిన్నప్పటికెట్లి నేను మాలెస్క కథలు సదివినుల్లా! మొన్న సదివిన ఒక కథ.. మీకోసం.
ఒక ఊర్లె ఇద్దరు అములాడ వుట్టిన అన్నదమ్ములు ఉండెటోల్లు. ఒకాయన పేరు భీముడు. ఇంకోడు రాముడు. ఇద్దరికీ లగ్గాలయినయి. పెండ్లాం పిల్లలతోని ఒక్కటే ఇంట్ల ఉండి.. ఎవలంతల ఆల్లు బతుకుతాండ్లు. ఆల్ల ఇంట్లున్న మావిడిశెట్టు.. ఆ యాడాది మాలెస్క కాయలు గాశింది. ఓనాడు భీముడు.. పిల్లగాండ్లకు ఇద్దామని పొద్దుగాల్నే శెట్టు కాయలు తెంపవట్టిండు. అంతట్లకే రాముని పెండ్లాం సూశి ఉరుక్కుంట ఇంట్లకు వోయి.. “మీ అన్న మాడికాయలు దెంపుతాండు! మనకెట్ల?” అంట ఆన్ని ఏగేశింది. పెండ్లాం మాటలు వట్టుకొని.. ఎన్కముంగట ఏం సోచాయించకుంట ఉరికచ్చి, అన్న మీదికి ఎగిరెగిరివోయి ఒర్రవట్టిండు రాముడు. పాపం.. భీమునికేం తోయలే! “మన శెట్టేగద.. పిల్లగాండ్ల కోసమని రొండు కాయలు దెంపిన!” అంట సముజాయించ వోయిండు. రాముడు ఇంకా ఎక్వ ఒర్రవట్టిండు. అంతట్లకే లొల్లి ఇని.. భీముని పెండ్లాం గూడ అచ్చింది. లొల్లి మాలెస్కనే పెద్దగైంది. సుట్టుపక్కోళ్లు అందరు జమైండ్లు.
శెట్టు నాదంటె.. నాదంట అన్నదమ్ములిద్దరు పీకులాడవట్టిండ్లు. లొల్లి ఎంతకు తెగకపోయె వరకు.. ఇద్దర్ని ఆడకట్టోల్లు బీర్బల్ తానికి దీస్కవోయిండ్లు. ఇద్దరి ముచ్చట్లు ఇన్నడు బీర్బల్. “శెట్టు నేను వెట్టిన! నీళ్లు గట్టి కాపాడిన!” అంట భీముడు జెప్తే.. “కాదు. నేను, నా పెండ్లామే అన్ని జేశినం! అది నాదే!” అన్నడు రాముడు. లొల్లి అస్సలుకే ఒడువకుంటే.. ఆడకట్టోల్లను గవాయి కోసం లోపలికి విలిపిచ్చుకొని ఇశారం జేశిండు. అంత ఎర్కయింది. ఇద్దరన్నదమ్ములతోని.. “సూడుండ్లి! సూత్తుంటె ఆ శెట్టుకు మీరిద్దరూ ఆసాముల్లెక్క గొడుతాండ్లు. నాతోని ఈ తప్ష జేసుడు అయ్యేటట్టు లేదు. ఒక పని జెయ్యిండ్లి. నేను మీతోని ఇద్దరు పంజులను వంపుతున్న! ఇంటికి వోయి శెట్టుకున్న కాయలన్ని దెంపి.. శెరి సగం దీస్కోండి. మల్ల మల్ల పంచాయితి లేకుంట శెట్టును గొట్టేశి, కట్టెలు గూడం శెరి సగం దీస్కోండ్లి” అన్నడు. అందుకు రాముడు మస్తు ఖుషీ అయ్యి.. “అట్లనే!” అంట తల్కాయ ఊపిండు. భీముడు.. “అయ్యా! బాంచెన్ దొర.. ఆ శెట్టు కాయలు నాకేమద్దు! రామునికే ఇయ్యండ్లి! బంగారమసొంటి శెట్టును కాయలకోసం గొట్టుడద్దు దొర” అంట బతిమిలాడిండు. ఎంటనే బీర్బల్.. “ఈ శెట్టు వెట్టింది భీముడే! అందుకే బిడ్డలెక్క సాదిన శెట్టును నరుకొద్దని అన్నడు. ఈ ముచ్చట దెలుసుకోనీకెనే శెట్టు గొట్టుమన్న.. కాయలు, శెట్టు భీమునివే! రాముడు జూటా! జుర్మానా ఏత్తున్న!” అంట ఫైస్లా జేశిండు.
… పత్తిపాక మోహన్
Read More :
Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది
Children Stories | చెట్టుకు గుర్రం పుడితే.. చేపలు చెట్టెక్కినయ్
మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

