Children Stories | శెంబు లింగాన్ని శెంబు ఏదిరా అని అడిగితే దాచిపెట్టిన బంగారాన్ని దొంగోళ్లకు సూపెట్టిండు
Children Stories | ఆని పిసపిస సూపులు, బట్టలు జూశి జరంత గమ్మతి జేద్దామని.. “నీ పేరేంది?” అంట అడిగిండొకడు. ఎంటనే.. “శెంబులింగం” అంట గట్టిగ జెప్పిండు.. ఇనంగనే అందరు పుసుక్కున నవ్విండ్లు. ఇంకింత మజాక్ జేద్దామని ఇంకోడు.. “శెంబులింగం.. గిలాసలింగం ఏందిరా?! నువ్వు శెంబులింగమైతే మరి నీ శెంబు ఏదిరా?” అంట అడిగిండు.
Children Stories |ఎన్కట ఒక ఊర్లె శెంబులింగం అనే ఎడ్డోడు ఉంటుండె. ఆనికేం దెల్వది. అంత పిసపిస.. నసనస. ఊర్లె అందరికి ఆడు టైంపాస్. ఈళ్ల ఊరు అడివికి పక్కన్నే ఉంటుండె. ఎప్పటికి దొంగల భయం ఉంటుండె. అట్లనే ఒకపారి బందిపోటోల్లు ఊరు మీద వడుతండ్లని మత్లావు దెలిశింది. ఊరోల్లంత ఆల్లతాన ఉన్న బంగారం, నగలు, నాణాలు అన్ని ముల్లెలు గట్టి సావిడి కాడున్న గడ్దివాము కింద పొక్క దవ్వి అండ్ల దాశివెట్టిండ్లు. ఓనాడు రాత్రి అనుకున్నట్టె దొంగల గుంపచ్చి ఊరుమీద వడ్డది. ఇల్లిల్లు దేవులాడిండ్లు. ఏద్దొరికితె అది ముల్లె గట్టుకున్నరు. ఎవ్వల దగ్గర ఎండి బంగారం గనవడకుంటె.. ముచ్చట ముందే దెలిశిందేమోనని ఒక్కొక్కన్ని గొట్టుకుంట అడుగవట్టిండ్లు. శెంబులింగం దగ్గరికి రాంగనే ఆడెట్లనో అనిపిచ్చిండు. ఆని పిసపిస సూపులు, బట్టలు జూశి జరంత గమ్మతి జేద్దామని.. “నీ పేరేంది?” అంట అడిగిండొకడు. ఎంటనే.. “శెంబులింగం” అంట గట్టిగ జెప్పిండు.. ఇనంగనే అందరు పుసుక్కున నవ్విండ్లు. ఇంకింత మజాక్ జేద్దామని ఇంకోడు.. “శెంబులింగం.. గిలాసలింగం ఏందిరా?! నువ్వు శెంబులింగమైతే మరి నీ శెంబు ఏదిరా?” అంట అడిగిండు. పేరువెట్టి ‘శెంబు.. గింబు’ అనంగనే మనోనికి మస్తు రేషమచ్చింది. ఎంటనే.. “నా శెంబా..! అందరు ఆల్ల బంగారం ఏడ దాశిపెట్టిండ్లో నేను గూడ నా శెంబును ఆన్నే దాశివెట్టిన” అంట జెప్పిండు. అసలు ముచ్చట ఎరుకయ్యెటాలకు, దొంగలు గడ్దివామి కింద దాశివెట్టిన ముల్లేమూటా అంత సదుర్కవోయిండ్లు. ఊరోల్లంత నెత్తినోరు గొట్టుకుంట.. “ఓరి పిస్సోడా! నువ్వు జెయ్యవట్టే మా ముల్లెలన్ని వోయినయ్” అంట తిట్టవట్టిండ్లు. మనోడు తక్వ తిన్నడా.. “మీ ముల్లెలే వేయినట్టు ఏడుత్తాండ్లు.. నా శెంబు గూడ వోయింది” అంట లబోదిబోమన్నడు.
… పత్తిపాక మోహన్
Read More :
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది
Children Stories | చెట్టుకు గుర్రం పుడితే.. చేపలు చెట్టెక్కినయ్
మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

