Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది
Children Stories | అడివంత తిర్గితిర్గి యాష్టకచ్చి కూకున్న నక్కను.. “ఏమైంది? గట్లున్నవ్” అంట అడిగింది భూదేవి. ‘అమ్మయ్య! భూతల్లిని ఎట్లన్న బుదురకిచ్చి బోర్లేత్త’ అనుకొని.. “భూతల్లి.. భూతల్లీ! నీ దగ్గరికే అత్తన్న. నువ్వే ఎదురుంగచ్చినవు. నాకు జరూర్గ కొన్ని పైసలు అక్కరవడ్డది. మల్లచ్చే అయితారం నీ పైసలు నీకిత్త. ఒక నూర్రూపాలు బాకియ్యి” అంట బతిమ్లాడింది.
Children Stories | ఎన్కట ఒక అడివిల ఒక్కనక్క ఉండేటిది. దానికున్న ఇకమతులు దునియాల ఇంకో నక్కకు లేవంటే అవద్దం గాదు. గంత ఇకమతులదది. అడివిల శిన్న – పెద్ద జీవాలన్నిట్ని ఎక్కన్నో ఓ దగ్గర బోర్లేశింది, మాయ జేశింది. అందుకే.. అడివిల దాని పేరు జెప్తెనే జీవాలన్ని బుగులు వడుతయి. ఒకపారి నక్కకు ఏదో కొననీకి కొన్ని రూపాలు అక్కర వడ్డది. చేతిల బుడ్డకొత్త లేదు! అక్కరనేమో జరూరాయె. అడివంత తిరిగి కనిపిచ్చిన అందర్ని శేపోయి అడిగింది.
పాత దోస్తు పిల్లిమామ దగ్గర్కి వోయి.. “మామా! నాకు జర అక్కరుంది. కొన్ని పైసలు బాకియ్యవా! రేపెల్లుండి నీ బాకీ నీకు ముట్టజేత్త” అంట అడిగింది. దీని సంగతి ఎర్కనేనాయె. “అమ్మో! నిన్నెవడు నమ్ముతడు.. నీకు బాకిత్తే బండగ్గొట్టిన సున్నమే” అంట మొండిశెయ్యి జూపిచ్చింది పిల్లి. ఆడికెల్లి ఇంకో దోస్తు ఉడుత కాడికి వోయి అడిగింది నక్క. అప్పటికే మాలెస్కసార్లు నక్క శేతుల అది మోసపోయిందాయె. బాకీ ముచ్చటినంగనే మూతి ముడ్సుకొని తుర్రుమని శెట్టు మీదికి ఉరికింది. మల్ల మాట్లాడకుంట అన్ని మూస్కోని ఆడికెల్లి పాత దోస్తు కుందేలు దగ్గరికి వోయి బాదంత జెప్పుకొన్నది.
కుందేలు మాలెస్కసార్లు నక్క చేతుల కెల్లి తప్పిచ్చుకొని పానాలు గాపాడుకుంది. అండ్ల ఈ నక్క గురించి బాగ ఎర్కనాయె. ఏడుపు మొకంబెట్టి.. “బావా! నాతాన పైసలు యాడుంటయి!? నీకెర్కె గదా” అంట తప్పిచ్చుకున్నది. అయినకాడల్ల అడిగి సూశింది. కానీ, దీని గురించి ఎర్కే గన్క ఎవ్వలు బుడ్డకొత్తన్న ఇయ్యలేదు గదా.. ‘మంచిగైంది!’ అంట మస్తు కుషీగైనయి. అడివంత తిర్గితిర్గి యాష్టకచ్చి కూకున్న నక్కను.. “ఏమైంది? గట్లున్నవ్” అంట అడిగింది భూదేవి. ‘అమ్మయ్య! భూతల్లిని ఎట్లన్న బుదురకిచ్చి బోర్లేత్త’ అనుకొని.. “భూతల్లి.. భూతల్లీ! నీ దగ్గరికే అత్తన్న. నువ్వే ఎదురుంగచ్చినవు. నాకు జరూర్గ కొన్ని పైసలు అక్కరవడ్డది. మల్లచ్చే అయితారం నీ పైసలు నీకిత్త. ఒక నూర్రూపాలు బాకియ్యి” అంట బతిమ్లాడింది.
ఆడీడ నక్క గురించి భూదేవి గూడ ఇన్నది. కొంచెం కొంచెం ఎర్కనే గాబట్టి.. ససేమిరా ‘ఇయ్య!’ అన్నది. కాల్లు శేతులు వట్టుకొని ఎట్లనో భూతల్లిని ఒప్పిచ్చి పైసలు వట్టిచ్చింది నక్క. వారమాయె.. నెలాయె.. నక్క రాదు! పైసలియ్యది! అడిగినప్పుడల్లా అప్పుడిప్పుడంట గడపవట్టింది. ఇగ గిట్లయితె గాదని ఒకపారి నక్క ఎన్కవడ్డది భూతల్లి. తప్పిచ్చుకుంట అడివంత అటీటు ఉరికింది నక్క. ఉరుక్కుంట ఉరుక్కుంట సర్కారు తుమ్మకొమ్మకు గొట్టుకుంది. కుడికంట్లె ముల్లు గుచ్చుకొని ఆయింత కన్నువేంది. కన్ను నొప్పి తక్వ అయినంక కొన్ని దినాలకు నక్క బైటికచ్చింది. అచ్చుడచ్చుడే భూతల్లికి ఎదురువడ్డది. సూడంగనే గట్టిగ దొర్కవట్టింది భూతల్లి.. “ఏయ్! దొంగనక్క నా బాకీ ఎప్పుడు గడ్తవు? పైసలిచ్చెదాంక పానం దీశినవ్! ఇచ్చినంక కనిపిత్తలేవ్! నిన్నిడిశిపెట్ట” అంట తోకను గట్టిగ వట్టుకుంది. “అయ్యో! భూతల్లి.. జర మంచిగ జూడు, నువ్వు బాకిచ్చింది నాకుగాదు. నేను గుడ్డి నక్కను. నీ దగ్గర బాకీ దీస్కున్న నక్కకు నాలెక్క ఒక్క కన్నే ఉందా!? రెండు కండ్లున్నయా! జర సూసుకో” అంట జెప్పింది. భూతల్లికి ఏం జెయాల్నో ఎర్కగాలె. తెల్ల మొకమేసుకొని పాపం.. అట్లనే నిలవడ్డది భూతల్లి.
… పత్తిపాక మోహన్
Read More :
Children Stories | చెట్టుకు గుర్రం పుడితే.. చేపలు చెట్టెక్కినయ్
మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

