మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | ఒక ఊర్లె ఇద్దరు భార్యాభర్తలు ఉండేటోళ్లు. ఆళ్లది బంగార మసొంటిసంసారం. కలిసిమెలిసి ఉండి, కట్టపడి పని జేసుకునేటోళ్లు. ఆ ఇంటాయినె అంటే భార్యకు పానం పానం. కని ఆయినె చేశే పనులే.. ఆమెకు యాట్టకు తెప్పిస్తుండే!
Children Stories | ఒక ఊర్లె ఇద్దరు భార్యాభర్తలు ఉండేటోళ్లు. ఆళ్లది బంగార మసొంటిసంసారం. కలిసిమెలిసి ఉండి, కట్టపడి పని జేసుకునేటోళ్లు. ఆ ఇంటాయినె అంటే భార్యకు పానం పానం. కని ఆయినె చేశే పనులే.. ఆమెకు యాట్టకు తెప్పిస్తుండే! కొత్తోళ్లు, పాతోళ్లు.. అని లేదు, అందరిని మంచిగ జూసుకుంటుండే. ఎవ్వలేమడిగినా.. లేదనకుంట ఇత్తుండే. కొన్నికొన్ని తాపలల్ల జమానతు కూడా ఇచ్చి ఇరుక్కపేయిండు. పెండ్లాం నెత్తినోరు గొట్టుకుని ఎంత మొత్తుకున్నా మారకపొంగ.. రోజురోజుకు ఇంకా ఎక్వ గావట్టిండు. ఇంటికి ఎవ్వలచ్చినా.. అర్సుకునుడు మానలే! అచ్చినోళ్లు ఎరుకున్నా, లేకున్నా.. సుట్టాలకు సుట్టాలైనా పానం పానమోలే సూసుకుంటుండే. ఆళ్లు ఈనె అమాయకం జూశి.. పురాగా బోర్లేశి పోదురు. ఎట్లయినా పెనిమిటికి బుద్ధి జెప్పాల్నాని అనుకుంది ఆయనె పెండ్లాం.
ఒకపారి తోక సుట్టం అసొంటి ఇద్దరు పనిలేనోళ్లు.. పక్కూర్ల పనుందనుకుంట అచ్చి ఈళ్లింట్ల తిష్టేశిండ్రు. పద్దినాలైనా ఇగ వోరు, అగ వోరు. ఆమె ఎట్లనన్న ఆళ్లను ఎల్లగొట్టాల్నాని అనుకున్నది. ఎప్పటోల్నే అచ్చినోల్లిద్దరు తిని ఊర్ల తిరుగ బోయిండ్రు. పగటీలి పని జేసుకొని పెనిమిటి ఇంటికి రాంగనే.. “ఇయ్యాల్ల సుట్టాలకు గారెలు జేశిపెడుత! అటుకు మీదికెల్లి రోకలిబండ తీశియ్యి” అన్నది. కుషీగా తీశిచ్చి, పొలానికి నీళ్లు గట్టనీకి వోయిండు పెనిమిటి. అంతట్లకే తిని తిరుగవోయినోల్లు ఇంటికి అచ్చిండ్రు. ఆళ్లు రాంగనే.. “ఎందుకక్క నువ్వు ఇయ్యాల్ల నారజ్గున్నవ్?” అంట అడిగిండ్రు.
దానికామె.. “నా బాధంత మీ గురించే, ఇయ్యాల్ల జెర నా పెనిమిటికి దూరంగ ఉండుండ్రి. ఆయినెకు ఒక అలవాటున్నది. ఏకాదశి నాడు సుట్టాలను రోకలిబండతోని గొడుతడు. ఇప్పుడే రోకలి తీశిచ్చి పొలం కాడికి బోయిండు. ఆయినె అచ్చేటాళ్లకు రోకలికి పూజ జేశిపెట్టాలె!” అనుకుంట జెప్పింది. అది ఇనంగనే ఇద్దరికి బుగులు వుట్టింది. ముల్లెమూట సదుర్కొని అవుతల వడ్డరు. అంతట్లకే పొలంకెళ్లి ఇంటాయినె అచ్చిండు. సుట్టాల గురించి అడిగిండు. “ఆళ్లు రోకలిబండ గావాల్నని అడిగిండ్రు. నేను ఇయ్యననంగనే నారాజ్ అయిపోయిండ్రు” అన్నది. “అయ్యో.. గీ పాత రోకలికి గింత ఇది జేత్తవా!? నేను ఇచ్చత్త” అని ఆళ్లు వోయిన తొవ్వల ఈనె గూడ వోయిండు. ఊరు దాటక ముంగల్నే ఆళ్లు గనిపిచ్చిండ్రు. ఈనె రోకలిబండ వట్టుకొని ఎనుక ఉరికచ్చుడు జూశి.. కొట్టనీకే అత్తుండనుకొని సుట్టాలు ఉర్కవట్టిండ్రు. ఆళ్లెనుకనే.. ఈనెగూడ వోవట్టిండు. ఊళ్లెకు వోయినంక గీ ముచ్చటంత సుట్టాలందరికీ జెప్పిండ్రు వాళ్లు. అప్పటిసంది సుట్టాలెవ్వలూ ఆళ్లింటికి రాలేదు.
… పత్తిపాక మోహన్
Read More :
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

