Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ
Children Stories | ఒక ఊల్లె ఇద్దరాలు మొగలు ఉండెటోళ్లు. ఇద్దరు ఇద్దరే! ఆల్లకు అక్కపక్కోల్లు దప్ప.. అయినోల్లంట ఎవ్వలు లేరు. అందరితోని పానం పానంగ ఉంటెటోల్లు. ఆలుమొగలిద్దరు చిల్క గోరెంకల్లెక్క కలిశిమెలిశి ఉండెటోల్లు. ఇద్దరు ఇకమతులోల్లె.. శెప్పకున్న ఒకల మతిలున్నది ఇంకోల్లకు ఎరుకైతుండె.
Children Stories | ఒక ఊల్లె ఇద్దరాలు మొగలు ఉండెటోళ్లు. ఇద్దరు ఇద్దరే! ఆల్లకు అక్కపక్కోల్లు దప్ప.. అయినోల్లంట ఎవ్వలు లేరు. అందరితోని పానం పానంగ ఉంటెటోల్లు. ఆలుమొగలిద్దరు చిల్క గోరెంకల్లెక్క కలిశిమెలిశి ఉండెటోల్లు. ఇద్దరు ఇకమతులోల్లె.. శెప్పకున్న ఒకల మతిలున్నది ఇంకోల్లకు ఎరుకైతుండె. ఆల్ల సంసారం మతి, గతి తప్పకుంట మంచిగుంటుండె. కొన్ని దినాలకు ఆమె నీల్లు వోసుకుంది. పశిద్దయ్యే యాళ్లయ్యింది. నిండు పొద్దులు.. ఆల్లకు సుట్టపక్కాల్లేరు గనుక ఇంట్లనే ఉన్నరు. మొగడు భార్యను బంగారమోలె సూసుకుంటాండు. అమాసనాడు రాత్రి ఇద్దరాలు మొగలు తిని పండుకున్నరు. నడిమి రాత్రి ఏదో సప్పుడినచ్చింది. జల్దిన ఇద్దరు లేశి కూసున్నరు. కండ్లు చిమ్మిచ్చి సూత్తె.. శేతుల కత్తులు, గుత్పలు వట్టుకొని ఇద్దరు దొంగలు సాయిమాను కాడ అటీటు తిరుక్కుంట కనవడ్డరు. మొదలు బయపడ్డడు గని, పొద్దులతోనున్న పెండ్లాన్ని సూడంగనే ఇకమతు దోశింది. పెండ్లాం శెవుల జెప్పిండు. ఎట్లనన్న అక్కపక్కలోల్లత్తె ఆపద వోతదని అర్థమైంది. మెల్లగ సప్పుడు గాకుంట కిటీకీలు తెరిశిండు.
దొంగలకు ఇనచ్చెటట్టు.. మొగనితోని మాట్లాడవట్టింది పెండ్లాం. “ఔ మామ! రేపో మాపో నీను నీళ్లాడుత గద, కొడుకు వుడ్తె ఏం పేరు వెడుతవ్?” అంట అడిగింది. దానికాయినె అందరికి ఇనచ్చెటట్టు.. “బాలయ్య” అంట అరిశిండు. దానికామె.. “ఒకడు వుడితె బాలయ్య సరే! మరి అముడాల వుడితె ఏంపేర్లు వెడుతవు?” అంట అడిగింది. దానికి ఆయినె గట్టిగా.. “భీమయ్య!” అంట ఒర్రిండు. నవ్వుకుంట పెండ్లాం అడిగింది.. “మరి ముగ్గురు వుడితె..?” అని. దానికి ఎంటనే.. “దొంగ” అంట అరిశిండు మొగడు. ఈ ఒర్రుడుకు తెలివైన బాలయ్య, భీమయ్యకు.. పక్కింట్ల దొంగలు వడ్డరని అర్థమైంది. మెల్లగ ఆడకట్టోల్లందరిని లేపి గుత్పలు వట్టుకొని అచ్చిండ్రు. నాల్గు దిక్కులకెల్లి ఇంటి సుట్టు నిల్సొని.. దొంగలు ఎటు వోకుంట జేశిండ్రు. దొంగల్ని దొర్కవట్టి ఇయ్యరమయ్యర జోపి.. కచేరిల అప్పజెప్పిండ్రు. ఇద్దరాలు మొగల ఇకమతును తారీఫ్ జేశిండ్లు.. అందుకే ‘ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె!’ అంటరు.
… పత్తిపాక మోహన్
Read More :
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది
Children Stories | చెట్టుకు గుర్రం పుడితే.. చేపలు చెట్టెక్కినయ్
మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

