Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Children Stroies | పిలగాండ్లు! మీకు చెన్నాల్రామలింగం గురించి ఎరికె గదా! అదే తెనాలి రామలింగం. ఆయినెకు ఒకపారి పనివడి.. దూరం బోవాల్సచ్చింది. ఏడికేయినా.. బోడిలింగమోలె చెన్నాల్రామలింగం ఒక్కడే వోతడు. ఆ తాపగూడ అట్లనే బైలెల్లిండు. అడివిపొంట నడుసుకుంట వోవుడాయె.
Children Stroies | పిలగాండ్లు! మీకు చెన్నాల్రామలింగం గురించి ఎరికె గదా! అదే తెనాలి రామలింగం. ఆయినెకు ఒకపారి పనివడి.. దూరం బోవాల్సచ్చింది. ఏడికేయినా.. బోడిలింగమోలె చెన్నాల్రామలింగం ఒక్కడే వోతడు. ఆ తాపగూడ అట్లనే బైలెల్లిండు. అడివిపొంట నడుసుకుంట వోవుడాయె. దబదబ నడుసుకుంట పోవట్టిండు. అంతట్లకే ఇంకొకాయినె గలిశిండు. దండం బెట్టి మాటలు గలిపిండు. తాను గూడ చెన్నాల్రామలింగం పొయ్యే ఊరికే వోతున్న అన్నడు. సోపతి దొరికిందని రామలింగం జరంత తిరమైండు.
కొత్తాయినె.. “ఈ జంగల్ల జరంత ఉషారు గుండాలె! దొంగలెక్వ ఉంటరు. పొద్దంత నడిశి పొద్దుగూకంగనె ఏడనన్న ఆగి పండుకోవాలె. రాత్రి పయాణం జెయ్యద్దు” అంట జెప్పిండు. ఈ కొత్తోడెవలో గాదు, ఆ జంగల్ల కతర్నాక్ దొంగ. ఆడు కత్తులు గిత్తులు సూయించి దొంగతనం జెయ్యడు. గిట్లనే ఆడికెల్లి పొయ్యెటోల్లతోని తోటోల్లలెక్కనే వొయ్యి.. ఆల్లను బోర్లేశి దోసుకుంటడు. అట్లనే రామలింగణ్ని జూశి.. ఏషం గీషం మంచిగున్నయి గన్క మాలెస్కనే దొరుకుతదనుకున్నడు. మాట్లాడుకుంట మాట్లాడుకుంట నడువవట్టిండ్లు. అంతట్లకే పొద్దుగూకింది. ఆడున్న తావులన్నీ కొత్తోనికి ఎరుకేనాయె.
“రాత్రయితె ముంగటికి వోవుడు కట్టం. దగ్గర్ల సత్రం ఉంటది. ఆడికోయి పండుకుని తెల్లారె వోదాం” అంట జెప్పిండు. ఇద్దరు సత్రంలకు వోయి, తిని.. ఒక అర్రల పండుకున్నరు. రామలింగానికి కొత్తోని ఆగమాగం జూశి అనుమానమచ్చింది. కండ్లు మూసుకుని పన్నట్టు జేశిండు. రామలింగం పన్నడనుకొని మనోడు మెల్లగ రామలింగం ముల్లె, మూటలు లెంకులాడిండు. సంచిల జూశిండు. మెల్లమెల్లగ ఇకమతుతోని మెత్తకింద జూశిండు. బుడ్డ కొత్త దొరుకలె. నారాజై పండుకున్నడు. తెల్లారి లేవంగనే.. మల్ల నడుసుడు మొదలువెట్టిండ్లు. మాపటీలి ఎప్పటోలనే దగ్గరున్న సత్రంల పండుకున్నరు.
కొత్తోడు మల్ల సంచులు సదురుడు షురూ జేశిండు. ఎప్పటిలెక్కనే రామలింగం మెత్తకింద గూడ లెంకిండు. మాలెస్క తండ్లాడిండు. అయినా ఏం దొరుకలె. నారాజై సప్పుడు జెయ్యకుంట నిద్రవోయిండు. తెల్లారి ఎప్పటి తీర్గనే నడుసుడు మొదలువెట్టిండ్లు. ఇంకొంచెం సేపయితే.. ఇగ ఆల్ల ఊరు అత్తది. కొత్తోడు పుట్టి బుద్ధి తెల్శినప్పటిసంది దొంగతనాలు జేత్తండు. ఆని జిందగీ మొత్తంల.. ఈ ఒక్కపారె గిట్లయ్యింది. ఇగ ఏమన్న గానీ అనుకున్నడు.
“అయ్యా! నేను ఒకటి అడుగుత జెప్పుండ్లి. నేను నీ ఏషం జూశి.. నీ ఎనుకచ్చిన దొంగను. నీతాన పైసలు బాగనే ఉన్నయని నాకెరుక. గని రెండు దినాలు ఎంత లెంకులాడినా.. ఏం దొరుకకపాయే! నాతోనే ఉంటివి, నాకు దెల్వకుంట ఏడ దాశిపెట్టినవు? జెరంత జెప్పు నీకు పుణ్యముంటది” అంట బతిమిలాడిండు. రామలింగం నవ్వుకుంట.. “నిన్ను సూడంగనే నీ కత ఎరుకైంది. అంతట్లకే నేను పన్నానుకొని నువ్వు ఆడ ఈడ పునుకుతున్నవు. అంతట్లకే నాకు ఒక ఇకమతు తోశింది. నా పైసలన్ని రోజురాత్రి.. నీ మెత్త కింద వెట్టి నిమ్మలంగ పండుకున్న” అంట జెప్పిండు. గా మాటలినంగనే.. గుడ్లెల్లవెట్టిండు దొంగోడు.
… పత్తిపాక మోహన్
Read More :
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది
Children Stories | చెట్టుకు గుర్రం పుడితే.. చేపలు చెట్టెక్కినయ్
మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

