Children Stories | గిది గూడ అకుబరు – బీరుబలు కతనే. అకుబరు తానికి ఎప్పుడంటె అప్పుడు అచ్చి పోయే సౌలత్.. ఒక్క బీరుబలుకే ఉంటుండె. గట్లనే ఒకపారి ఎండకాలంలో మంచి మాడిపండ్లు అచ్చినయి అకుబరు తానికి. అంతట్లకే ఆడికి బీరుబలు గూడ అచ్చిండు. “రా… రా! మాడిపండ్లు తిందం!” అంట విలిశిండు అకుబరు. ఇద్దరు ఎదురుంగ ఎదురుంగ కూసొని.. శెరొక ఇస్తరు వెట్టుకుని.. పండ్లు తింటాండ్లు. నపరో రొండు మూడు దిన్నరు. బీరుబలును కాశింత గమ్మతి చేద్దాం అనుకున్నడు అకుబరు. ఆయినె దిన్న పండ్ల పిక్కలను గూడ బీరుబలు ఇస్తర్లనే ఎయ్యవట్టిండు. దాంతోని అకుబరు ముంగట ఒక్క పిక్క గూడ లేదు. బీరుబలు తాన మాత్రం మాలెస్క జమైనయి.
అంతట్లకే తినుడాపి.. బీరుబలు శెయ్యి గోక్కోవట్టిండు. గది జూసిన అకుబరు.. “ఏందయ్యా! గంతట్లకే అయిపోయిందా!? మస్తు ఆకలి మీద ఉన్నట్లున్నవు. గిన్ని పండ్లు దిన్నవు. ఇంకొన్ని దిను!” అంట పరాశ్కం ఆడిండు. దానికి బీరుబలు.. “నాకు సాలు హుజూర్! మీరే నాకంటే ఎక్వ ఆకలి మీదున్నరు. నేను పిక్కలన్న ఇడిశిన. మీరు అవ్విగూడ ఇడువలె. మీ ఇస్తార్ల ఒక్క పిక్కనన్న గనవస్తలేదు!” అంట జవాబిచ్చిండు. బీరుబలు ఇకమతు జూశిన అకుబరు.. పొట్టుపొట్టు నవ్విండు. అటెన్క ఇద్దరు గల్శి ఇంకొన్ని పండ్లు దిన్నరు.
పత్తిపాక మోహన్
Children Stories | మొగులు మీద సుక్కలకు.. ఆవాలకు మస్త్ లింకు పెట్టిన బీర్బల్!
Children Stories | అరశేతుల ఎంటికలు ఎందుకు మొలవవో గమ్మతిగా జెప్పిన బీర్బల్
Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ