Children Stories | అయ్యో పాపం అని జాలి చూపిస్తే రాజుకే సుక్కలు చూపిచ్చిండు!
Children Stories | ఎన్కట ఒక రాజు ఉండేటోడు. ఆయినెకు అయిందానికి, కాందానికి ఇరాం లేకుంట ఇనాంలిచ్చుడు పిస ఉంటుండె. మోక దొరికితె సాలు సబలున్న చప్రాసికెల్లి జాగిద్దారు దాంక.. ఎవ్వలు ఊకుండెటోల్లు గాదు. దొరికిన కాడికి బరుకుదురు.
Children Stories | ఒకపారి ఒక దేశం రాజు నగురమంత తిరుక్కుంట.. ఎవలెవలు, ఎట్లున్నరంట సూత్తండు. పోంగపోంగ ఒక చౌరస్తకాడ పెయ్యిమీద శినుగుల బొంత గప్పుకొన్న ఒక మనిషి కనవడ్డడు. రాజుకు పాపమనిపిచ్చి ఆయినెతానకు వోయి.. “సలివెడ్త లేదా!?” అంట అడిగిండు. దానికాయినె.. “నాకెందుకు సలి వెడ్తది. సలి నా బొంత పొక్కలల్లకెల్లి ఇటుకెల్లచ్చి.. అటుకెల్లి వోతది. ఇగ సలెందుకు వెడ్తది? నీ సాలువల కెల్లి సలి జొత్తె.. అవుతలికి వోదు. నీకే సలి వెట్టాలె!” అంట అన్నడు. రాజుకు నవ్వచ్చింది.
“అట్లనేగనీ.. నాతాన నూరు బంగారు రూపాలున్నయి. అండ్లకెల్లి ఇరువై నీకిత్త. నన్ను రాజనీ, హుజూరనీ విలుత్తవా?” అంట అడిగిండు రాజు. “ఇరువై రూపాలకే పొగడనీకి నాకేం పన్లేదా?” అంట అన్నడు ఆయినె. “మరి సగం రూపాలిత్తె?” మల్లడిగిండు రాజు. “గప్పుడు ఇద్దరం బరాబరైతం. ఇగెందుకు నిన్ను పొగుడ్త?” అన్నడు. “నాతాన నూరు రూపాలున్నయి. ఆయిన్ని నీకే ఇత్త! గప్పుడన్న పొగుడ్తవా?” అంట మల్లడిగిండు రాజు. దానికాయినె.. “నూర్రూపాలు నాకే ఇచ్చినంక నీతాన ఏముండయి గదా! నేనే అమీర్నైతి. నీ అసొంటి గరీబును ఎందుకు పొడుగ్త!?” అంట జెప్పిండు. రాజుకు ఆయినె తెలివర్తమై.. తన తాన్నే కొలువుల వెట్టుకున్నడు.
పత్తిపాక మోహన్
Read More :
Children Stories | అన్ని తెలిసినోడు ఈ దునియాల ఎవ్వలుంటరు?
Children Stories | బీర్బల్తో మజాక్ చేయబోతే అక్బర్‌కే రివర్స్ తగిలింది!
Children Stories | మొగులు మీద సుక్కలకు.. ఆవాలకు మస్త్ లింకు పెట్టిన బీర్బల్!
Children Stories | అరశేతుల ఎంటికలు ఎందుకు మొలవవో గమ్మతిగా జెప్పిన బీర్బల్
Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

