BAN vs ZIM : టెస్టు క్రికెట్లో మరో సంచలనం. ఆతిథ్య బంగ్లాదేశ్‌కు జింబాబ్వే(Zimbabwe) జట్టు పెద్ద షాకిచ్చింది. మూడేళ్ల తర్వాత బంగ్లాపై సుదీర్ఘ ఫార్మాట్లో జయభేరి మోగించింది. తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(57, 54) హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా.. పేసర్ బ్లెస్సింగ్ ముజరబని 9 వికెట్లతో రాణించాడు. 147 పరుగుల ఛేదనలో బంగ్లా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తన పేస్‌తో బంగ్లా నడ్డివిరిచిన ముజరబని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
స్వదేశంలో పెద్ద జట్లను సైతం మట్టికరిపించే బంగ్లాదేశ్‌కు చుక్కెదురైంది. జింబాబ్వే చేతిలో భారీ ఓటమి మూటగట్టుకుంది. ఎడమ చేతివాటం పేసర్ బ్లెస్సింగ్ ముజరబని విజృంభణతో రెండు ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో మొమినుల్ హక్(50), కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(40)ల పోరాటంతో బంగ్లాదేశ్ 191కే ఆలౌటయ్యింది.
Instrumental in Zimbabwe’s first Test win since March 2021!
Blessing Muzarabani is Player of the Match in Sylhet 👏 #BANvZIM pic.twitter.com/GquKnRWD5y
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2025
అనంతరం దీటుగా బదులిచ్చింది జింబాబ్వే. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(57), సియాన్ విలియమ్స్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయితే.. ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(5-52) దెబ్బకొట్టడంతో 273 పరుగులకే పర్యాటక జట్టు ఆలౌటైంది.. 82 పరుగుల ఆధిక్యం సాధించిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాకు గట్టిగా పోరాడింది.
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను వణికించిన ముజరబని మళ్లీ నిప్పులు చెరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టి మ్యాచ్ కాపాడుకోవాలనుకున్న శాంటో బృందాన్ని వణికించాడు. డేంజరస్ మొమినుల్(47), శాంటో(60)లను ఔట్ చేసిన అతడు.. మిడిలార్డర్‌ను కూల్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, బంగ్లా 255కే కుప్పకూలింది. ఛేదనలో జింబాబ్వే బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(54), బెన్ కరాన్ (44)లు తొలి వికెట్‌కు 95 రన్స్ జోడించి పటిష్ట స్థితిలో నిలిపారు.
Zimbabwe replicate their 2018 heroics to clinch another Test victory in Sylhet 🔥#BANvZIM 📝: https://t.co/fipkX4Y5j5 pic.twitter.com/LN1biJkCob
— ICC (@ICC) April 23, 2025
వీళ్లిద్దరి జోరుతో విజయానికి చేరువైన జింబాబ్వేను మిరాజ్(5-50) వరుసగా వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నావెస్లీ మధీవెరె(19 నాటౌట్), రిచర్డ్ గరవ(4 నాటౌట్)లు అసమాన పోరాటంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. దాంతో, 3 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది జింబాబ్వే. సిరీస్ విజేతను నిర్ణయించే రెండో టెస్టు ఏప్రిల్ 28న మొదలుకానుంది.