Turkey Earthquake | టర్కీలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణ నష్టం జరిగేనా..!
Turkey Earthquake | టర్కీ (Turkey) లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్ (Istanbul) లో తీవ్ర ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది.
Turkey Earthquake : టర్కీ (Turkey) లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్ (Istanbul) లో తీవ్ర ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇస్తాంబుల్‌కు నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదని, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ భూకంపం ధాటికి బల్గేరియా, గ్రీస్, రొమేనియా దేశాల్లోనూ ప్రకంపనలు కనిపించాయని చెప్పారు. కాగా రెండేళ్ల క్రితం వచ్చిన భూకంపాన్ని మరువకముందే తాజాగా మళ్లీ భూమి కంపించడంతో టర్కీ వాసులు వణికిపోతున్నారు.
2023 ఫిబ్రవరిలో టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాంతో తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ విలయంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలోనూ ప్రకంపనలు రావడంతో 6 వేల మంది చనిపోయారు. ఇక, ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపాలు సంభవించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

