IPL 2025 : భారత క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) ఐపీఎల్ 18వ సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. కుదురుకున్నాడంటే చాలు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) గెలుపు గుర్రంగా మారాడు. ఈ ఎడిషన్‌లో మూడు అర్థ శతకాలతో మెరిసిన రాహుల్ మరో మైలురాయికి చేరుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 5 ,000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. దాంతో, మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
ఏప్రిల్ 22 సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ రెచ్చిపోయాడు. ఛేదనలో కళాత్మక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్(57 నాటౌట్) హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 5 వేల క్లబ్లో చేరాడు. ఈ డాషింగ్ బ్యాటర్ 130వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సొంతం చేసుకోగా.. వార్నర్ 130 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
𝐊𝐋𝐞𝐚𝐫𝐥𝐲 𝐢𝐧 𝐚 𝐥𝐞𝐚𝐠𝐮𝐞 𝐨𝐟 𝐡𝐢𝐬 𝐨𝐰𝐧 👌
An unbeaten 57* (42) from KL Rahul gets him a well-deserved milestone 👏
Relive his knock ▶️ https://t.co/o6H822E91a#TATAIPL | #LSGvDC | @DelhiCapitals | @klrahul pic.twitter.com/hGDRuFviYA
— IndianPremierLeague (@IPL) April 22, 2025
ఐపీఎల్ అంటేనే శివాలెత్తిపోయే విరాట్ కోహ్లీ 157 ఇన్నింగ్స్‌ల్లో 5కే రన్స్ కొట్టాడు. అంతేకాదు ఈ మెగా లీగ్‌లో అత్యధిక రన్స్ బాదిన వాళ్లలో మెరుగైన సగటు రాహుల్ పేరిటే ఉంది. నిదానంగా మొదలెట్టి.. నిప్పు కణికలా విజృంభిస్తున్న ఈ వికెట్ కీపర్ 46.35 యావరేజ్‌తో రన్స్ సాధించాడు. వార్నర్ సగటు 40.52 ఉండగా.. కోహ్లీ 39.27తో, ఎంఎస్ ధోనీ 38.96 సగటుతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
మెగా వేలంలో రూ.14 కోట్లకు ఢిల్లీ గూటికి చేరిన రాహుల్ తనదైన షాట్లతో అలరిస్తున్నాడు. టాపార్డర్ శుభారంభం అందిస్తే చాలు.. ఇక జట్టును గెలిపించే బాధ్యతే తనదే అన్నట్టుగా అజేయంగా ఢిల్లీని విజయ తీరాలకు చేరుస్తున్నాడు. ఈ సీజన్లో అతడు 7 మ్యాచుల్లో 153.81 సగటుతో 323 రన్స్ కొట్టాడు. అత్యధిక స్కోర్.. 93 నాటౌట్.
𝙆𝙇 𝙍𝙖𝙝𝙪𝙡 𝙁𝙞𝙣𝙞𝙨𝙝𝙚𝙨 𝙤𝙛𝙛 𝙞𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 💥
Unstoppable 57* from Rahul seals the victory for #DC and a double over #LSG 💪
Scorecard ▶️ https://t.co/nqIO9mb8Bs#TATAIPL | #LSGvDC | @DelhiCapitals | @klrahul pic.twitter.com/KhyEgQfauj
— IndianPremierLeague (@IPL) April 22, 2025