Brendon Taylor : జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ (Brendon Taylor) పునరాగమనానికి వేళైంది. అవినీతికి పాల్పడి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టేలర్.. తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. అతడి రీ -ఎంట్రీకి జింబాబ్వే క్రికెట్ బోర్డు పచ్చ జెండా ఊపడంతో న్యూజిలాండ్‌తో జరుగబోయే రెండో టెస్టుతో అతడు మైదానంలోకి దిగనున్నాడు. తప్పకుండా టేలర్ రెండో మ్యాచ్ తుది జట్టులో ఉంటాడని బుధవారం కెప్టెన్ క్రెగ్ ఇర్విన్ వెల్లడించాడు. పునరాగమనం కోసం గత ఏడాది కాలంగా అతడు ఎంతో శ్రమించాడని ఇర్విన్ పేర్కొన్నాడు.
టేలర్ఫై ఐసీసీ విధించిన మూడున్నరేళ్ల నిషేధం ఈ ఏడాది జూలై 25తో ముగిసింది. దాంతో, కివీస్‌తో ఆగస్టు 7న జరుగబోయే రెండో టెస్టులో ఆడేందుకు టేలర్ ఉవ్విళ్లూరుతున్నాడు. 39 ఏళ్ల వయసులో మళ్లీ ఆడబోతున్నా. జట్టును గెలిపించేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. నాకు మరో అవకాశం ఇవ్వడానికి అంగీకరించిన జింబాబ్వే బోర్డు, కెప్టెన్ ఇర్విన్‌కు ధన్యవాదాలు అని టేలర్ అన్నాడు.
వన్డే వరల్డ్ కప్(2011) తర్వాత జింబాబ్వేకు సారథ్యం వహించిన టేలర్.. 2015 వరకూ కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే.. అనూహ్యంగా 2021లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అందుకు కారణం డ్రగ్స్(Drugs), ఆల్కహాల్. ఈ రెండింటికీ బానిసగా మారిన అతడు రిహాబిలిటేషన్ కేంద్రంలో చేరాడు. అక్కడ నిపుణుల ప్రేరణతో టేలర్‌లో మార్పు వచ్చింది. మునపటి మనిషిలా మారిన అతడు ఇంటివద్దనే కుర్రాళ్లకు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. ప్రస్తుతం వన్డే, టీ20లకు సారథులగా ఉన్న సియన్ విలియమ్స్(39 ఏళ్లు), సికిందర్ రజా(38 ఏళ్లు) తనకు స్ఫూర్తి అంటున్నాడు టేలర్.
Brendan Taylor is 39… banned for 3.5 years… and still walking back into Test cricket 🔥
Life gave him a big hit, but he’s showing there’s still fight left.
Second Test vs NZ — this one’s personal. 💪 pic.twitter.com/xkBMTaBSjG— Crikistaan (@crikistaan) July 30, 2025
‘కోచ్‌గా మారాలనుకున్నా. కానీ, నేను ఇప్పటికీ క్రికెట్ ఆడాలనుకుంటున్నా. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా సత్తా చాటుతాననే నమ్మకం నాకుంది. ప్రస్తుతం నేను శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నాను. మళ్లీ ఆడాలనుకుంటున్న నాకు ఎండీ గివ్మోర్ ఎంతో మద్దతుగా నిలిచాడు. ‘కోచింగ్ సంగతి తర్వాత ఆలోచించు. రాబోయే వన్డే వరల్డ్ కప్ మీద దృష్టి పెట్టు’ అని చెప్పాడు. అతడి సలహా నచ్చింది. నాకు అప్పటికీ 41 ఏళ్లు వస్తాయి. అయినా సరే.. దేశం కోసం ఆడేందుకు సిద్ధమవుతున్నా’ అని టేలర్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.