Yuvraj Singh | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్లపై మాజీలతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేలవమైన ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న ఆటగాళ్లకు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ, విరాట్‌పైనే విమర్శలు చేయడం సరికాదన్నారు. గత కొన్ని నెలలుగా టెస్టు ఫార్మాట్లో భారత్ ఓడిపోతూ వస్తున్నది. న్యూజిలాండ్‌పై స్వదేశంలో టీమిండియా 0-3 తేడాతో ఘోరంగా పరాజయం పాలైంది. స్వదేశంలో మూడు అంతకంటే ఎక్కువ టెస్టుల్లో భారత్‌కు ఇదే తొలిసారి క్లీన్‌స్వీప్. అదే సమయంలో పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలైంది.
రెండు సిరీస్‌లో ఓటమికి బ్యాటింగ్‌లో రాణించకపోవడమే కారణమని మాజీలు ఆరోపించారు. ముఖ్యంగా రోహిత్, కోహ్లీని లక్ష్యంగా చేసుకున్నారు. యువరాజ్ మాట్లాడుతూ.. తన వరకైతే న్యూజిలాండ్‌తో టెస్టుల్లో ఓడిపోవడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. స్వదేశంలో 3-0 తేడాతో సరికాదన్నారు. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం ఇప్పటికీ ఆమోదయోగ్యమైందేనని.. ఎందుకంటే గతంలో రెండుసార్లు గెలిచారని.. ఈ సారి దురదృష్టవశాత్తు టీమిండియా ఓడిపోయిందన్నారు. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం కొనసాగిస్తుందని.. ఇది తన అభిప్రాయమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ సెంచరీ చేసినా.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 190 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ ఐదు ఇన్నింగ్స్‌లో 31 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరిపైనే విమర్శలు చేయడం అన్యాయమని యూవీ పేర్కొన్నారు. గతంలో వారిద్దరు సాధించిన విజయాలను మర్చిపోతున్నారని.. ఈ కాలపు గొప్ప క్రికెటర్లలో ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో భారత్ బలంగా పునరాగమనం చేస్తుందని స్పష్టం చేశారు.
రోహిత్, కోహ్లీతో పాటు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై తనకు పూర్తి నమ్మకం తెలిపాడు. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంపై యూవీ ప్రశంసించాడు. మ్యాచ్ నుంచి తప్పుకోవడం చాలా పెద్ద విషయమని.. గతంలో కెప్టెన్ దూరం మ్యాచ్‌కు దూరంగా ఉండడం తాను ఎప్పుడూ చూడలేదని తెలిపాడు. తనకంటే ముందు జట్టును నిలబెట్టడమే రోహిత్ శర్మ గొప్పదమని పేర్కొన్నారు. అతను గొప్ప కెప్టెన్ అని.. మనం గెలిచినా.. ఓడియా అతను గొప్ప కెప్టెన్‌గా మిగిలిపోతాడని పేర్కొన్నారు. రోహిత్ కెప్టెన్సీలోనే వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడామని.. టీ20 ప్రపంచకప్ గెలిచామని గుర్తు చేశాడు యూవీ. జట్టు ప్రదర్శనను విశ్లేషిస్తూ విమర్శకులు సంయమనం పాటించాలని యూవీ సూచించాడు.