Enforcement Directorate | ప్రముఖ మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ (Yuvraj Singh), రాబిన్ ఉతప్ప (Robin Uthappa) చిక్కుల్లో పడ్డారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా వీరికి కేంద్ర దర్యాప్తు సంస్థ (Probe Agency) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
1xBet బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి సమన్లు పంపింది. ఈనెల 22న ఉతప్ప, 23న యువరాజ్ సింగ్ ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వీరితోపాటూ బాలీవుడ్ రియల్ హీరో సోనూ సూద్ (Sonu Sood)కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 24న సోనూసూద్‌ను విచారణకు రావాలని ఆదేశించింది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లావాదేవీల్లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ వీరిని ప్రశ్నించనుంది.
బెట్టింగ్ యాప్స్ (betting app case) వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి సైతం విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్‌సింగ్, యువరాజ్‌సింగ్, సురేశ్ రైనాలను సైతం ఈడీ ఇప్పటికే విచారించింది.
Also Read..
Sonu Sood | బెట్టింగ్ యాప్స్ కేసు.. సోనూసూద్‌కు ఈడీ సమన్లు
Assam | పోలీసులకు చిక్కిన అవినీతి తిమింగలం.. ఏసీఎస్ అధికారిణి ఇంట్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం