రాజ్కోట్: (Avi Barot died) యువ క్రికెటర్, భారత మాజీ అండర్-19 టీమ్ కెప్టెన్ అవి బరోట్ (29) గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. బరోట్ ఆకస్మిక మరణం పట్ల సౌరాష్ట్రతోపాటు మొత్తం క్రికెట్ ప్రపంచం షాక్లో ఉన్నది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఈ విషాద ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. బరోట్ ప్రతిభావంతుడైన ఆటగాడిగా వర్ణిస్తూ, అసోసియేషన్ అతడి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బరోట్ మరణానికి భారత మాజీ బ్యాట్స్మన్ వసీం జాఫర్ సంతాపం తెలిపారు.
టైటిల్ జట్టులో భాగమైన అవి బరోట్, 2020 రంజీ ట్రోఫీని గెలుచుకున్న సౌరాష్ట్ర జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను 2019-20 సీజన్లో రంజీ ట్రోఫీని గెలుచుకున్న సౌరాష్ట్ర జట్టులో కూడా సభ్యుడుగా ఉన్నారు. సౌరాష్ట్ర తరఫున 21 రంజీ ట్రోఫీ మ్యాచ్లు, 17 లిస్ట్-ఏ, 11 దేశీయ టీ-20 మ్యాచ్లు ఆడాడు. 2011 లో భారతదేశం అండర్-19 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. అదే సంవత్సరంలో అండర్-19 విభాగంలో బీసీసీఐ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ అందుకున్నాడు. తక్కువ కాలంపాటు కొనసాగించిన క్రికెట్ కెరీర్లో అవి బరోట్.. మొత్తం 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 17 లిస్ట్ ఏ మ్యాచ్లు టీ 20 మ్యాచ్లలో ఆడాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 48.49 సగటుతో 1,547 పరుగులు చేశాడు. 2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నమెంట్లో గోవాపై బరోట్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు.
‘అవి బరోట్ ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి, విచారానికి గురయ్యాం. బరోట్ అద్భుతమైన, చాలా ప్రతిభావంతుడైన క్రికెటర్’ అని సౌరాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ జయదేవ్ షా విచారం వ్యక్తం చేశారు. బరోట్ మృతిపట్ల భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా విచారం వ్యక్తం చేస్తూ.. ‘అవి బారోట్ మరణ వార్త విని చాలా బాధకు లోనయ్యాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని సంతాప సందేశంలో తెలిపారు.
పండ్ల వ్యర్థాల నుంచి కొత్త రకం బ్యాండేజీ.. సింగపూర్ శాస్త్రవేత్తల సృష్టి
పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ రవి చౌదరి
చైనా సుదీర్ఘ అంతరిక్ష యాత్ర ప్రారంభం
కేంద్ర మంత్రిపై మన్మోహన్సింగ్ కుమార్తె ఆగ్రహం.. ఎందుకంటే..?
41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల విలీనం.. కొత్తగా 7 డిఫెన్స్ కంపెనీలు
అన్నపూర్ణలకే ఆహార సమస్యలు.. రక్తహీనత సమస్యలు తొలిగేదెలా?
ఎయిమ్స్ సీనియర్ వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగికదాడి
బాలీవుడ్ వృద్ధ బేగం ఫరూక్ జాఫర్ కన్నుమూత
చిన్నారులు అభిమానించే వాల్ట్ డిస్నీ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..