Ravi Chaudhary : పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ రవి చౌదరి
Ravi Chaudhary : భారత సంతతికి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అందలం ఎక్కించారు. ఇండియన్-అమెరికన్ అయిన రవి చౌదరిని...

వాషింగ్టన్ : (Ravi Chaudhary) భారత సంతతికి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అందలం ఎక్కించారు. ఇండియన్-అమెరికన్ అయిన రవి చౌదరిని పెంటగాన్ పదవికి జో బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏరోస్పేస్, రక్షణ నిపుణుడు, యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్నత స్థానాల్లో పనిచేసిన రవి చౌదరిని.. పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వర్జీనియాలో నివసించే రవి చౌదరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పెంటగాన్‌లో ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఇన్‌స్టాలేషన్స్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ సెక్రటరీ బాధ్యతలను అమెరికా ప్రభుత్వం రవి చౌదరికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది. రవి నియామకానికి ప్రెసిడెంట్ జో బైడెన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే యూఎస్ పార్లమెంట్ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ లో అన్ని ఇన్స్టాలేషన్లు, వ్యూహాలను సిద్ధం చేసే బాధ్యత అతడిపై ఉంటుంది.
రవి చౌదరి 1993 నుంచి 2015 వరకు అమెరికా వైమానిక దళంలో క్రియాశీలంగా ఉన్నారు. అతను సీ-17 పైలట్ కూడా. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధంలో అనేక ఆపరేషన్లు చేపట్టాడు. ఏవియేషన్ ఇంజనీర్ కూడా అయిన రవి.. యూఎస్ వైమానిక దళానికి అత్యాధునిక సాంకేతికతను అందించడంలో సహకరిస్తారని ఆశిస్తున్నారు. బరాక్ ఒబామా కాలంలో ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్‌లో సభ్యుడుగా రవి చౌదరి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
చైనా సుదీర్ఘ అంతరిక్ష యాత్ర ప్రారంభం
కేంద్ర మంత్రిపై మన్మోహన్సింగ్ కుమార్తె ఆగ్రహం.. ఎందుకంటే..?
41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల విలీనం.. కొత్తగా 7 డిఫెన్స్ కంపెనీలు
అన్నపూర్ణలకే ఆహార సమస్యలు.. రక్తహీనత సమస్యలు తొలిగేదెలా?
ఎయిమ్స్ సీనియర్ వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగికదాడి
బాలీవుడ్ వృద్ధ బేగం ఫరూక్ జాఫర్ కన్నుమూత
చిన్నారులు అభిమానించే వాల్ట్ డిస్నీ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

