Manmohan Singh : కేంద్ర మంత్రిపై మన్మోహన్సింగ్ కుమార్తె ఆగ్రహం.. ఎందుకంటే..?
Manmohan Singh : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు జూలోని...

న్యూఢిల్లీ : (Manmohan Singh) కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు జూలోని జంతువులేమీ కాదని, తన తండ్రి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆమె తప్పుపట్టారు. డెంగ్యూ వ్యాధికి గురైన మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆయన కరోనా వైరస్‌కు గురయ్యారు. ఇప్పటికే మన్మోహన్‌సింగ్‌కు 1990, 2009 లో రెండు సార్లు బైపాస్ సర్జరీలు జరిగాయి.
ఆరోగ్య సమస్యలతో గత రెండు రోజులుగా మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం దవాఖానకు వచ్చారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరన్ కౌర్‌ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను మాండవీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని కొన్ని న్యూస్ ఛానళ్లు కూడా చూపించాయి. ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు.
‘మన్మోహన్సింగ్ ఎయిమ్స్‌లో డెంగ్యూ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రి వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే, పరామర్శిస్తున్న సమయంలో ఫొటోలను తీసుకోవడంపై అమ్మ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ వినిపించుకోకుండా ఫొటోలు తీసుకున్నారు. దీనిపై అమ్మ చాలా బాధపడింది. వాళ్లేమీ జూలో జంతువులు కాదు కదా? కొంచెమైనా నైతికత, వైద్య నిబంధనలు పాటించాలి కదా?’ అని మన్మోహన్ సింగ్ కుమార్తె డామన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.
ఇలాఉండగా, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కేంద్ర మంత్రి మాండవియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను తొలగించారు. ఫొటోగ్రాఫర్‌ని ఎయిమ్స్ వైద్యులు, మేనేజ్మెంట్ ఎలా లోపలికి అనుమతించారో చెప్పాలని పలువురు నెటిజెన్లు డిమాండ్ చేశారు. ఇలా చికిత్స పొందుతున్న వ్యక్తుల ఫొటోలు తీయడం మెడికల్ ఎథిక్స్‌ను ధిక్కరించడమే అవుతుందని ఫోరం ఫర్ మెడికల్ ఎథిక్స్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మంత్రి వెంటే ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల విలీనం.. కొత్తగా 7 డిఫెన్స్ కంపెనీలు
అన్నపూర్ణలకే ఆహార సమస్యలు.. రక్తహీనత సమస్యలు తొలిగేదెలా?
ఎయిమ్స్ సీనియర్ వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగికదాడి
బాలీవుడ్ వృద్ధ బేగం ఫరూక్ జాఫర్ కన్నుమూత
చిన్నారులు అభిమానించే వాల్ట్ డిస్నీ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

