Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Boy Dies After Firecracker Explodes | దీపావళి రోజున ఒక బాలుడి చేతిలో బాణసంచా పేలింది. అతడి ఛాతికి అది తగలడంతో ఆ బాలుడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.
న్యూఢిల్లీ: దీపావళి రోజున ఒక బాలుడి చేతిలో బాణసంచా పేలింది. అతడి ఛాతికి అది తగలడంతో ఆ బాలుడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. (Boy Dies After Firecracker Explodes) దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీపావళి సందర్భంగా ఆదివారం రాత్రి పదేళ్ల రిషి తన కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చాడు. ‘స్కై రాకెట్’ను ఆ బాలుడు వెలిగిస్తుండగా చేతిలో అది పేలింది. అలాగే అది పైకి వెళ్లకుండా నేరుగా బాలుడి ఛాతికి బలంగా తగలడంతో అతడు కుప్పకూలిపోయాడు.

Delhi Boy Dies
కాగా, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రిషిని వెంటనే నరేలాలోని సత్యవాది రాజా హరీశ్ చంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే వైద్య నిర్లక్ష్యం కారణంగానే రిషి మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మరోవైపు దీపావళి రోజున ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి 257 అత్యవసర కాల్స్ వచ్చాయి. వీటిలో 214 కాల్స్ అగ్నిప్రమాదాలకు సంబంధించినవి కాగా, 24 కాల్స్ బాణసంచాకు సంబంధించినవి. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య అత్యధికంగా 85 అత్యవసర కాల్స్ వచ్చాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య మరో 61 కాల్స్ వచ్చాయని చెప్పారు. అగ్నిప్రమాద సంఘటనలకు స్పందించిన అగ్నిమాపక సిబ్బందిలో ఐదుగురు గాయపడినట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

