WPL 2024 MI vs RCB | బెంగళూరుది అదే వ్యథ.. ముంబైకి మూడో విజయం
WPL 2024 MI vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) మూడో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)ను చిత్తుగా ఓడించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన...
WPL 2024 MI vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) మూడో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)ను చిత్తుగా ఓడించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మంధాన సేన నిర్దేశించిన 132 పరుగుల స్వల్ప ఛేదనలో ఓపెనర్లు హేలీ మాథ్యూస్(26), యస్తికా భాటియా(31) బౌండరీలతో విరుచుకు పడ్డారు.
ఆర్సీబీ బౌలర్లను ఉతికారేస్తూ తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. సోఫీ డెవిన్ ఓవర్లో రీచా ఘోష్ డైవింగ్ క్యాచ్‌తో యస్తిక పెవిలియన్ చేరింది. ఆ తర్వాత కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(27), అమేలియా కేర్(40 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపు దిశగా నడిపించారు. 118 పరుగులు వద్ద బ్రంట్ ఔటైనా .. కేర్, పూజా వస్త్రాకర్(8 నాటౌట్)లు లాంఛనం పూర్తి చేశారు. దాంతో, ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరగా.. వరుసగా రెండో ఓటమితో ఆర్సీబీ మూడో స్థానంలో నిలిచింది.
Yastika Bhatia departs for a quick-fire 31(15) but the @mipaltan openers started the powerplay with some special strokeplay!
Live 💻📱https://t.co/VqyJ4Y545d#TATAWPL | #RCBvMI pic.twitter.com/xf76PsSSO4
— Women’s Premier League (WPL) (@wplt20) March 2, 2024
చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ జట్టు ఆది నుంచి తడబడింది. మూడో ఓవర్లోనే డేంజరస్ స్మృతి మంధానా(9)ను ఇసీ వాంగ్ వెనక్కి పంపింది. ఆ తర్వాత వచ్చిన సబ్బినేని మేఘన(11), సోఫీ డెవిన్(9) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, సీవర్ బ్రంట్, ఇషాక్ ఓవర్లలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో ఆర్సీబీ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
In the air & caught on the second attempt!#RCB lose Richa Ghosh as Pooja Vastrakar strikes ⚡️⚡️
Live 💻📱https://t.co/VqyJ4Y545d#TATAWPL | #RCBvMI pic.twitter.com/enR4uIIbCn
— Women’s Premier League (WPL) (@wplt20) March 2, 2024
ఆ దశలో అలీసా పెర్రీ(44 నాటౌట్), జార్జియా వరేహమ్(27)లు ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోర్ 100 దాటించారు. వీళ్లు పట్టుదలగా ఆడి ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. దాంతో, ముంబై ఇండియన్స్ బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పూజా వస్త్రాకర్, నాట్ సీవర్ బ్రంట్‌లు తలా రెండు వికెట్లు తీశారు. సైకా ఇషాక్, అమేలియా చెరొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి
- Varalaxmi Sarathkumar | సైలెంట్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..!
- CM Revanth Reddy | అంగన్వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్ విధానం.. సీఎం రేవంత్ ఆదేశం
- Janasena | చచ్చేదాకా జనసేనలోనే కొనసాగుతా.. పవన్‌కళ్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

