Varalaxmi Sarathkumar | సైలెంట్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..!
Varalaxmi Sarathkumar | మరో టాలీవుడ్ నటి పెళ్లికి సిద్ధమైంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ త్వరలోనే పెళ్లికూతురు కానున్నది. ఈ క్రమంలోనే తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ముంబైలో జరిగిన ఈ నిశ్చితార్థానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
Varalaxmi Sarathkumar | మరో టాలీవుడ్ నటి పెళ్లికి సిద్ధమైంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ త్వరలోనే పెళ్లికూతురు కానున్నది. ఈ క్రమంలోనే తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ముంబైలో జరిగిన ఈ నిశ్చితార్థానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మార్చి 1వ తేదీన జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకొచ్చాయి. ఈ ఫొటోలతో పాటు వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలియజేసే ఒక లెటర్ కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది.
నికోలయ్ సచ్దేవ్ ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్. ఆర్ట్ గ్యాలరీలు కూడా నిర్వహిస్తుంటాడు. ఆన్లైన్లో వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటాడు. కాగా, నికోలయ్‌తో వరలక్ష్మీకి 14 ఏండ్లుగా పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇప్పుడు తమ రిలేషన్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి మాత్రం కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్‌కుమార్, నికోలయ్ సచ్దేవ్ ఇద్దరూ కూడా తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. దీంతో వచ్చే ఏడాదిలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?



