Indians Killed: అమెరికా హైవేపై కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి
Indians Killed: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతిచెందారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ప్రమాదానికి లోనైంది.
న్యూఢిల్లీ: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు(Indians Killed) మృతిచెందారు. ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ప్రమాదానికి లోనైంది. ఎస్యూవీ వాహనం అన్ని లేన్లను దాటుకుంటూ.. 20 ఫీట్ల ఎత్తులో గాలిలోకి వెళ్లిందని, ఆ తర్వాత సమీపంలో ఉన్న చెట్లను ఢీకొన్నట్లు గ్రీన్విల్లే కౌంటీ పోలీసులు వెల్లడించారు. వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం అతి వేగంగా వెళ్తున్నట్లు చీఫ్ డిప్యూటీ కరోనర్ మైక్ ఎల్లిస్ తెలిపారు. కారును ఓ చెట్టుపై గుర్తించామని, అది ముక్కలు ముక్కలైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఒకరు మాత్రమే గాయాలతో బయటపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాహనంలో ఉన్న డిటెక్షన్ సిస్టమ్ వల్ల ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

