IND vs WI : తొలి టెస్టులో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్ రెండో టెస్టులోనూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. యశస్వీ జైస్వాల్(162 నాటౌట్) సెంచరీతో గర్జించగా.. సాయి సుదర్శన్ (87) అర్ధ శతకంతో మెరిశాడు. విండీస్ బౌలర్లను కాచుకున్న ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు రన్స్ జోడించారు. శతకానికి చేరువైన సుదర్శన్ ఎల్బీ డబ్ల్యూగా వెనుదిరగడంతో పర్యాటక జట్టు ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం మూడో సెషన్లో యశస్వీకి జతగా శుభ్‌మన్ గిల్(19) ఆడుతున్నారు. ఈ ద్వయం ఇప్పటికే 51 రన్స్ రాబట్టింది. టీమిండియా స్కోర్.. 306/2. మరో నాలుగో ఓవర్లు మిగిలి ఉన్నాయంతే. వికెట్ కోసం విండీస్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ, ఫలితం కనిపించడం లేదు.
Piling on the runs! 🔝
1️⃣5️⃣0️⃣ up for Yashasvi Jaiswal 👏#TeamIndia inch closer to 300 runs with captain Shubman Gill joining him 👍
Updates ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 | @ShubmanGill pic.twitter.com/4UPrcRASe2
— BCCI (@BCCI) October 10, 2025
అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (38) ఔటయ్యాడు. ఆ తర్వాత మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్(87) క్రీజులో పాతుకుపోయాడు. వికెట్ బౌలింగ్‌కు సహకరించని పిచ్ మీద యశస్వీ (162 నాటౌట్), అతడు పరుగుల పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే యశస్వీ తన కెరీర్లో ఏడో టెస్టు శతకం పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం తర్వాత 58 పరుగలు వద్ద వారికన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సుదర్శన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. టీ తర్వాత అతడు వారికన్ ఓవర్లో ఎల్బీగా ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్()తో యశస్వీ మరో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు.