Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) మరో రికార్డు బద్ధలు కొట్టాడు. గత ఏడాదిగా సుదీర్ఘ ఫార్మాట్లో చెలరేగి ఆడుతున్న యశస్వీ అత్యధిక పరుగులతో రికార్డు సృష్టించాడు. ఒక ఏడాదిలో ఎక్కువ రన్స్ కొట్టిన భారత లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టు(Perth Test)లో హాఫ్ సెంచరీ బాది ఈ ఘనతకు చేరువయ్యాడు. తద్వారా భారత మాజీ ఓపెనర్, ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) పేరిట ఉన్న 16 ఏండ్ల రికార్డును ఈ యువకెరటం బ్రేక్ చేశాడు.
గౌతం గంభీర్ 2008లో 70.67 సగటుతో 1,134 పరుగులు సాధించాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు, 3 శతకాలు ఉన్నాయి. అదే యశస్వీ మాత్రం 1,161 పరుగులతో గౌతీని అధిగమించాడు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న యశస్వీ పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.
Stat Alert 🚨
Since 2004, this is the first time that #TeamIndia openers have put up a 100-run stand in Australia.
Keep going, Yashasvi🤝Rahul.#AUSvIND | @ybj_19 | @klrahul pic.twitter.com/EXrPrUeskZ
— BCCI (@BCCI) November 23, 2024
కానీ, రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాట్ పవర్ చూపిస్తూ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఖతర్నాక్ డిఫెన్స్‌తో, కండ్లుచెదిరే షాట్లతో అలరిస్తూ అర్ధ శతకం సాధించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి 170కి పైగా భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వీ టీమిండియా ఆధిక్యాన్ని 200లకు పెంచాడు.