Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) ఆరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఆడుతున్నది తొలి టెస్టు మ్యాచ్ అయినా.. ఎన్నో మ్యాచ్‌ల అనుభవం ఉన్న ఆటగాడిలా కనిపించాడు. ఏమాత్రం బెరుకు లేకుండా స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. వెస్టిండీస్‌పై డిమినికా(Dominica) వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆరంగేట్రం చేసిన యశస్వీ అద్భుత సెంచరీ(171)తో ఆకట్టుకున్నాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? అని అడిగితే.. భారత జట్టు తరఫున చాలా సార్లు ఆడానని ఊహించుకున్నానని యశస్వీ చెప్పాడు.
‘టీమిండియా జెర్సీ వేసుకోవడమే చాలా స్పెషల్. అదీ కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది’ అని యశస్వీ తెలిపాడు. తొలి టెస్టు సెంచరీని అతను తన తల్లిదండ్రులకు అంకితమిచ్చిన విషయం తెలిసిందే.
A memorable walk back to the hotel room after receiving his first Player of the Match award for India 🏆
Yashasvi Jaiswal has well and truly arrived at the international stage 👏🏻👏🏻#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/WSkMbcSBSq
— BCCI (@BCCI) July 15, 2023
వెస్టిండీస్ పర్యటనను 21 ఏళ్ల యశస్వీ ఘనంగా ఆరంభించాడు. తొలి మ్యాచ్‌లోనే తన ముద్ర వేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma,), కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. శుభ్‌మన్ గిల్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన యశస్వీ సంచలన ఆటతో సెంచరీ కొట్టాడు. రోహిత్ శర్మ(103)తో కలిసి తొలి వికెట్‌కు 225 రన్స్ జోడించాడు.
ఆరంగేట్రం టెస్టులో శతకం కొట్టిన యశస్వీ
ఆ తర్వాత విరాట్ కోహ్లీ(71 నాటౌట్)తో విలువైన పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత అశ్విన్(Ravichandran Ashwin) 7 వికెట్లతో విజృంభించడంతో వెస్టిండీస్ 130 పరుగులకే కుప్పకూలింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడినందుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
ఐపీఎల్లో సెంచరీ కొట్టిన యశస్వీ
ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్లో యశస్వీ వీరబాదుడు బాదాడు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తరఫున ఆడిన అతను ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. తన విధ్వంసక ఇన్నింగ్స్‌లతో సెలెక్లర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అయితే.. ఫైనల్లో ఆడే అవకాశం రాలేదు. దాంతో, సెలెక్టర్లు అతడికి విండీస్ టూర్‌తో మరో అవకాశం ఇచ్చారు.