బీజాపూర్: చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్‌లో ఇవాళ ఉదయం ఐఈడీ బాంబు(IED Blast) పేలింది. ఈ ఘటనలో 15 ఏళ్ల కుర్రాడు గాయపడ్డాడు. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న లేంద్ర-కర్చోలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన బాధిత యువకుడు నిషేధిత ప్రదేశానికి వెళ్లాడు. అతన్ని రామ్ పోతంగా గుర్తించారు. ప్రెజర్ ఐఈడీతో కాంటాక్టు కావడం వల్ల అది పేలినట్లు తెలుస్తోంది.ఆ యువకుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన తర్వాత అతన్ని సీఆర్పీఎఫ్ 22వ బెటాలియన్ క్యాంపునకు ఆ కుర్రాడిని తీసుకెళ్లారు. అక్కడ అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ ప్రాంతంలో మరేమైనా ఐఈడీలను ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. సాధారణంగా నక్సలైట్లు ఐఈడీలను ప్లాంట్ చేస్తుంటారు. సెక్యూర్టీ సిబ్బందిని టార్గెట్ చే్స్తారు. మావోయిస్టు హింస వల్ల గత ఏడాది 46 మందిభద్రతా సిబ్బంది ఐఈడీలకు ప్రాణాలు కోల్పోయారు.