Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. జిమ్ హక్కుల విషయంలో చెలరేగిన వివాదంతో ఒక కుటుంబంపై దుండగులు దాడిచేశారు. ఒక వ్యక్తిని, అతడి భార్యను దారుణంగా కొట్టారు. ఆమెపై అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు.. వారి కొడుకును నగ్నంగా చేసి వేధించారు. ఈ ఘటన ఈ నెల 2న ఢిల్లీలోని లక్ష్మీ నగర్లో జరిగింది. బాధితులు రాజేష్ గార్గ్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేష్ గార్గ్ ఆ ఇంటి బేస్ మెంట్ లో జిమ్ నిర్వహిస్తున్నాడు. దీని బాధ్యత మొత్తం సతీష్ యాదవ్ చూసుకునేవాడు. అయితే, జిమ్ హక్కుల విషయంలో ఇరువురి మధ్య వివాదం మొదలైంది.
ఈ విషయంలో సతీష్ యాదవ్ తమను మోసం చేశారని, తమ ఆస్తిని స్వాధీనం చేసకున్నాడని రాజేష్, అతడి భార్య ఆరోపించారు. దీని గురించి ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు. ఇదే సమయంలో జిమ్ పై తమ హక్కు గురించి ప్రశ్నించినందుకు రెండో తేదీన సతీష్ యాదవ్ మరో ముగ్గురితో కలిసి వచ్చి తీవ్రంగా దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బేస్ మెంట్ లో వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తుండగా నలుగురు వచ్చి తమపై తీవ్రంగా దాడి చేశారని తెలిపారు. అంతేకాదు.. తన భార్య జుట్టుపట్టుకుని లాగి, దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించినట్లు గార్గ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది గమనించిన తమ కొడుకు అక్కడికి రాగా.. అతడిపై కూడా దాడి చేసి, కొంతదూరం తీసుకెళ్లి దుస్తులు విప్పించినట్లు వివరించారు.
In #Delhi‘s Laxmi Nagar area, goons stripped a man, dragged him on the street, and assaulted him. The victim had a gym in the accused’s home, which sparked a dispute. pic.twitter.com/YP9CEWnA56
— Siraj Noorani (@sirajnoorani) January 5, 2026
ఈ ఘటనలో గార్గ్ తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి కొడుకును కూడా వీధిలోకి లాక్కెళ్లి ఇనుప రాడ్ తో దాడి చేయగా, తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సతీష్ యాదవ్ ను అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు వికాస్ యాదవ్, శుభం యాదవ్, ఓంకార్ యాదవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక.. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.