Carlos Alcaraz : తొలిసారి వింబుల్డన్(Wimbledon) ఫైనల్ చేరిన వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) టైటిల్‌పై గురి పెట్టాడు. రేపు అతను టైటిల్ పోరులో రెండో సీడ్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic)తో తలపడనున్నాడు. జకోను ఎదుర్కోవడం గురించి ఈ యంగ్ సంచలనం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెన్నిస్‌లో దిగ్గజమైన జకోతో వింబుల్డన్ ఫైనల్లో ఆడడం చాలా స్పెషల్‌గా ఉండనుందని అల్కరాజ్ అన్నాడు.
‘టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాడైన జకోవిచ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను.. మనం గొప్పగా ఉండాలంటే గొప్ప వాళ్లను ఓడించాలి’ అని అల్కరాజ్ తెలిపాడు. జకోవిచ్, అల్కరాజ్ ఆదివారం వింబుల్డన్ ఫైనల్లో తలపడనున్నాడు. గత రికార్డులు పరిశీలిస్తే.. వీళ్లిద్దరూ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో రెండు సార్లు ఎదురుపడ్డారు. ఈ రెండు సందర్భాల్లో చెరొకసారి విజయం సాధించారు. దాంతో, ఈసారి పైచేయి ఎవరిది? అనేది ఆసక్తికరంగా ఉండనుంది.
కార్లోస్ అల్కరాజ్, నొవాక్ జకోవిచ్
జకోవిచ్, అల్కరాజ్‌లు వింబుల్డన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. తొలి రౌండ్ నుంచి జోరు కొనసాగిస్తూ ఫైనల్లో అడుగుపెట్టారు. అల్కరాజ్ నిన్న జరిగిన సెమీఫైనల్లోడానిల్ మెద్వెదేవ్(Daniil Medvedev)ను చిత్తుగా ఓడించాడు. మూడు సెట్లలో 6-3, 6-3, 6-3తో మెద్వెదేవ్‌ను మట్టికరిపించాడు. మరోవైపు జకోవిచ్ అమెరికా స్టార్ 6-3, 6-4, 7-6 (7/4)తో ఎనిమిదో సీడ్ సిన్నర్(Jannik Sinner)పై గెలుపొందాడు. ఇది అతడికి తొమ్మిదో సారి టైటిల్ పోరులో నిలిచాడు.
జకో ఈసారి చాంపియన్‌గా నిలిస్తే 8 వింబుల్డన్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్(Roger Federer) రికార్డు సమం చేస్తాడు. అంతేకాదు ఇప్పటికే 23వ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలతో రికార్డు కొట్టిన జకో మరో ట్రోఫీ నెగ్గితే అమెరికా దిగ్గజం మార్గరెట్ కోర్ట్(Margaret Court)ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ రికార్డుకు చేరువవుతాడు. అయితే.. ఫైనల్లో అతడికి అల్కరాజ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. తొలిసారి ఫైనల్ చేరిన అతను టైటిల్ కోసం గట్టిగానే పోరాడనున్నాడు.