IND vs ENG 2nd Test : ఉప్పల్ టెస్టులో హాఫ్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51 నాటౌట్) విశాఖపట్టణం టెస్టులోనూ అర్ధ శతకం సాధించాడు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్(Shoaib Bashir) బౌలింగ్‌లో యశస్వీ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
యశస్వీ 89 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో వరుసగా రెండో ఫిఫ్టీ నమోదు చేశాడు. అండర్సన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్(4) ఫోర్‌తో జట్టు స్కోర్ 100 దాటించాడు. దాంతో, టీమిండియా లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 103 రన్స్ కొట్టింది.
5⃣0⃣ up & going strong! 💪 💪
Yashasvi Jaiswal notches up his 3⃣rd Test half-century! 👏 👏#TeamIndia inching closer to 100.
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/lcFpE9yggl
— BCCI (@BCCI) February 2, 2024
డెబ్యూ క్యాప్ అందుకున్న స్పిన్నర్ బషీర్ నాలుగో ఓవర్లోనే డేంజరస్ రోహిత్ శర్మ(14)ను ఔట్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేక్ బషీర్ హిట్‌మ్యాన్ లెగ్ స్లిప్‌లో ఓలీ పోప్ చేతికి చిక్కడంతో, భారత్ 40 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
YES, BASH! 👏
Bashir takes his first Test wicket by removing Sharma! ☝
Match Centre: https://t.co/tALYxvMByx
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/vynfpQ3xsp
— England Cricket (@englandcricket) February 2, 2024
అనంతరం గిల్, యశస్వీ ధాటిగా ఆడి రెండో వికెట్‌కు 49 రన్స్ జోడించారు. అయితే.. వెటరన్ పేసర్ అండర్సన్ సూపర్ డెలివరీతో శుభ్‌మన్ గిల్(34)ను బోల్తా కొట్టించాడు. బౌండరీతో టచ్‌లో ఉన్నట్టే కనిపించిన గిల్ ఆ తర్వాతి రెండు బంతులకే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, భారత్ 89 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.