Hemant Soren | సొరెన్ పిటిషన్ విచారణకు సుప్రీం నో.. హైకోర్టుకు వెళ్లాలని సూచన
Hemant Soren | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Hemant Soren | జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హవాలా లావాదేవీల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
హేమంత్ సొరేన్ తరఫున సుప్రీంకోర్టు విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ సోరెన్ అరెస్టయిన సంగతి చెప్పారు. బుధవారం రాత్రి హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సొరెన్ పిటిషన్ విచారణ సందర్భంగా.. రాష్ట్ర హైకోర్టులు రాజ్యాంగ బద్ధమైన న్యాయస్థానాలని, ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచి ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది.సీఎంగా హేమంత్ సొరెన్ రాజీనామా నేపథ్యంలో జార్ఖండ్‌లో జేఎంఎం నేత చంపాయి సొరెన్ సారధ్యంలో శుక్రవారం సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

