హ్యాట్రిక్‌పై హైదరాబాద్ గురి
రంజీ ట్రోఫీలో వరుసగా రెండు విజయాలతో జోష్‌లో ఉన్న హైదరాబాద్ మూడో విక్టరీతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో సోమవారం నుంచి జరిగే తమ మూడో పోరులో బలమైన పంజాబ్‌తో తలపడనుంది.
- నేటి నుంచి జింఖానాలో పంజాబ్‌తో రంజీ మ్యాచ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి : రంజీ ట్రోఫీలో వరుసగా రెండు విజయాలతో జోష్‌లో ఉన్న హైదరాబాద్ మూడో విక్టరీతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో సోమవారం నుంచి జరిగే తమ మూడో పోరులో బలమైన పంజాబ్‌తో తలపడనుంది. ఫలితం తేలే పిచ్‌పై స్పష్టమైన విజయం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ యాజమాన్యం ఈ పోరును ఉప్పల్ నుంచి జింఖానా గ్రౌండ్‌కు మార్చింది. త్రిపుర, ఆంధ్రపై జట్టు గెలిచిన హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్న స్టార్ ప్లేసర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పంజాబ్‌కు అందుబాటులో లేనప్పటికీ, ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఉన్నారు.
పేస్ ఆల్‌రౌండర్ సీవీ మిలింద్ కెప్టెన్సీలో బరిలో నిలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌లో తన్మయ్ అగర్వాల్, అభిరథ్ రెడ్డి, జి. రాహుల్ సింగ్, కె. హిమతేజ, రాహుల్ రాదేష్తో బలంగా ఉంది. బౌలింగ్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనే 20 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, జి. అనికేత్ రెడ్డి ప్రధాన ఆయుధాలుగా మారనున్నారు. మరోవైపు పంజాబ్‌కు ఐపీఎల్ స్టార్ ప్రభ్‌సిమ్రన్ సింగ్, సలీల్ అరోరా, ఈమాన్జోత్ సింగ్‌తో పాటు పేసర్ ఉమేష్ యాదవ్, స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ అదనపు బలాన్ని ఇస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

