జనవరి 1న ప్రారంభం?
అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘RC 17’(వర్కింగ్ టైటిల్) సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడు? అనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తూనే ఉన్నది. ఈ నెలలోనే సినిమా లాంఛనంగా మొదలవ్వనున్నదని నిర్మాతలే గతంలో చెప్పారు.
అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘RC 17’(వర్కింగ్ టైటిల్) సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడు? అనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తూనే ఉన్నది. ఈ నెలలోనే సినిమా లాంఛనంగా మొదలవ్వనున్నదని నిర్మాతలే గతంలో చెప్పారు. అయితే.. తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రీ రవిశంకర్ ‘RC 17’ ప్రారంభోత్సవంపై క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 1న ఘనంగా ఈ చిత్రం ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
అంతేకాదు, ఆ రోజు నుంచే నిరవధికంగా చిత్రీకరణ మొదలవుతుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ైస్టెలిష్ యాక్షన్, మాస్, లవ్ ఎంటర్టైనర్లతో వరుసపెట్టి సినిమాలు చేసిన డైరెక్టర్ సుకుమార్.. ‘రంగస్థలం’ నుంచి ైస్టెల్ మార్చారు. రూటెడ్ స్టోరీలతో ఆడియన్స్‌ని కట్టిపడేశారు. మళ్లీ ఇప్పుడు రామ్‌చరణ్ సినిమాతోనే ఆయన పంథా మార్చనున్నారు. రామ్‌చరణ్‌తో సుకుమార్ చేయనున్న ఈ సినిమా ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తున్నది.
సారా అర్జున్, ప్రీతి ముకుందన్ వీరిద్దరిలో ఎవరో ఒకర్ని ఇందులో కథానాయికగా ఎంపిక చేస్తారంటూ మొన్నటిదాకా వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా ‘సయారా’ ఫేం అనీత్ పడ్డా పేరు బలంగా వినిపిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

