Yashasvi Jaiswal : సుదీర్ఘ ఫార్మాట్లో సంచలనంగా మారిన భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) మరో ఘనత సాధించాడు. ‘నయా థౌంజడ్వాలా’గా రికార్డు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు సొంతగడ్డపై 1000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. దాంతో, ఒకే ఏడాదిలో వెయ్యి మార్క్ అందుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తద్వారా మాజీ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ (Gundappa Vishawanath) పేరిట ఉన్న రికార్డును యశస్వీ బద్దలు కొట్టాడు. 1979లో విశ్వనాథ్ ఈ ఫీట్ సాధించగా.. న్యూజిలాండ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 77 రన్స్ కొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 1,048 పరుగులతో అతడిని దాటేశాడు.
ఐపీఎల్ హీరోగా జట్టులోకి వచ్చిన యశస్వీ టెస్టుల్లో రికార్డులు దుమ్ము దులుపుతున్నాడు. తొలి బంతి నుంచే చెలరేగిపోయే యశస్వీ టెస్టుల్లో సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి భారత దిగ్గజ క్రికెటర్లకు సైతం సాధ్యంకాని రికార్డు సృష్టించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అలరిస్తూ తొలి 10 మ్యాచుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. తద్వారా 147 ఏండ్ల సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో ఈ ఘనతకు చేరువైన భారత ఆటగాడిగా నిలిచాడు.
Yashasvi Jaiswal on the charge! ⚡️ ⚡️
A quickfire FIFTY – his 8th in Tests! 👏 👏
He & Shubman Gill also complete a solid half-century stand 🤝
Live ▶️ https://t.co/YVjSnKCtlI#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/9RjrqqwB2y
— BCCI (@BCCI) October 26, 2024
చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 56, రెండో ఇన్నింగ్స్‌లో 10 రన్స్ చేసిన యశస్వీ 1,094 పరుగులతో అగ్రస్థానం సాధించాడు. లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) 978 పరుగులతో రెండో స్థానంలో, వినోద్ కాంబ్లీ 937 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ సిరీస్(England Sereis)లో దంచికొట్టిన యశస్వీ టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
77(65bals)#indvsnzl #INDvNZ #idfcfirstbanktestseries #YashasviJaiswal pic.twitter.com/tNWvs6Jihs
— Yashasvi Jaiswal ‘parody’ (@Yashasvi_Jaiswa) October 26, 2024
ధర్మశాల టెస్టులో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ బాది యశస్వీ ఈ మైలురాయికి చేరువయ్యాడు. దాంతో, తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ చిచ్చరపిడుగు 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ (Vinod Kambli) 14 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి రన్స్ కొట్టాడు.
YASHASVI JAISWAL on 🔥pic.twitter.com/6vIhLNtaX7
— Cricket Tells 🏏, 🇮🇳 (@CricketTells) October 26, 2024
18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు కొట్టిన ఛతేశ్వర్ పూజారా మూడో స్థానానికి పడిపోయాడు. అంతేకాదు బ్యాటింగ్ యావరేజ్లోనూ యశస్వీ రికార్డులు బ్రేక్ చేశాడు. అత్యంత చిన్నవయసులోనే టెస్టుల్లో వెయ్యి రన్స్ కొట్టిన యశస్వీ.. మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ 19 ఏండ్ల 217 రోజుల్లో వెయ్యి పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. యశస్వీ 22 ఏండ్ల 70 రోజుల్లో వెయ్యి రన్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ 21 ఏండ్ల 27 రోజుల్లో ఈ ఫీట్ సాధించాడు.