Renu Desai | టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ నెటిజన్లతో తన అభిరుచులను పంచుకుంటుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఆమె ఓ వీడియో షేర్ చేసింది. తాను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నానని ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు.
ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కోసం నేను ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశానో నాకు మాత్రమే తెలుసు. నేను 8 ఏండ్ల వయసు నుంచే మూగ జీవాలను సంరక్షిస్తూ వస్తున్నా. ఇది ఎప్పుడు చేస్తునే ఉన్నాను. కానీ దానీ గురించి ఫోకస్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు. ఒక షెల్టర్ పెట్టాలని కానీ వాటి కోసం గళం వినిపించాలని కానీ ఆలోచించలేదు. కానీ కరోనా టైంలో మూగ జీవాలకు ఏదైనా చేయాలని నాకు అనిపించింది. అందుకే నేను సోంతంగా ఎన్జీవో పెట్టాలని అనిపించింది. ఫైనల్గా ఈరోజు నా ఎన్జీవోను రిజిస్టర్ చేయించా. మూగ జీవాలపై ఇష్టం ఉండి ఆర్థిక సాయం చేయాలనుకునే వారు మా ఎన్జీవోకు డోనేషన్ ఇవ్వండి అంటూ రేణూ దేశాయ్ చెప్పుకోచ్చింది.