IND A vs ENG Lions : భారత ఏ జట్టు, ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి అనధికార టెస్టు (Unofficial Test) ఉత్కంఠగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో లయన్స్‌ను 587 ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(64), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(61 నాటౌట్)లు బౌండరీలతో విరుచుకుపడుతూ అర్ధ శతకాలు సాధించారు.
టీమిండియా ఆధిక్యాన్ని పెంచుతున్న ఈ ద్వయాన్ని రెహాన్ అహ్మద్ విడదీశాడు. క్రీజులో పాతుకుపోయిన యశస్వీని ఔట్ చేసి ఇంగ్లండ్ లయన్స్‌కు తొలి బ్రేకిచ్చాడు. ధ్రువ్ జురెల్ సహకారంతో మరో భాగస్వామ్యం నిర్మించే పనిలో ఉన్నాడు సారథి అభిమన్యు. ప్రస్తుతానికి భారత్ 104 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అభిమన్యు ఈశ్వరన్(61 నాటౌట్)
భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్‌లో 587 రన్స్ చేసింది. 30 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన భారత ఏ జట్టుకు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(64) అభిమన్యు ఈశ్వరన్(61 నాటౌట్)లు అదరే ఆరంభం ఇచ్చారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌కు బాటలు వేసిన కెప్టెన్ అభిమన్యు ఇప్పుడు కూడా అదే తరహాలో ధాటిగా ఆడుతున్నాడు. యశస్వీతో కలిసి తొలి వికెట్‌కు 123 రన్స్ చేసిన అతడు.. జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు.
ఐదు టెస్టుల సిరీస్ సన్నద్ధతలో ఉన్న భారత క్రికెటర్లు మొదటి అనధికార టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడారు. కరుణ్ నాయర్ (204) ద్విశతకంతో కదంతొక్కగా.. సర్ఫరాజ్ ఖాన్(92), ధ్రువ్ జురెల్(94)లు వీరకొట్టుడు కొట్టారు. టెయిలెండర్స్ సైతం బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా 557 పరుగులు చేసింది.
కరుణ్ నాయర్ (204)
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ లయన్స్ కూడా దీటుగా బదులిచ్చింది. భారత పేసర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఓపెనర్ టామ్ హైన్స్(171) సూపర్ సెంచరీతో గట్టి పునాది వేశాడు. మిడిలార్డర్ బ్యాటర్లు మాక్స్ హోల్డెన్(101)తో పాటు మౌస్లే(113)లు శతకాలు బాదగా తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 587రన్స్ కొట్టింది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు, శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టారు.