హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీ సెర్చ్ సెంటర్ పేరుతో సాగిన అక్రమ సరోగసీ, శిశువుల అక్రమ రవాణా కే సులో నిందితురాలిగా ఉన్న డాక్టర్ న మ్రతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అదుపులోకి తీసుకున్నది. అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపర్చడంతో న్యాయమూర్తి ఈ నెల 26 వరకు జ్యుడీషియ ల్ రిమాండ్ విధించారు.
దీంతో నమ్రతను చంచల్గూడ జైలు కు తరలించారు. గోపాలపురం పీఎస్ లో నమోదైన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించించింది.