Rachakonda | మంచాల, జూన్ 2 : అక్రమంగా గోవులను తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని రాచకొండ సీపీ సుధీర్‌బాబు హెచ్చరించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమంగా నగరానికి గోవులను తరలిస్తున్నారనే సమాచారంతో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి వద్ద సాగర్ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. గోవులను అక్రమంగా ఎవరైనా తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆగపల్లి సాగర్ రహదారిపై నిరంతరం మంచాల పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా సాగర్ రహదారిపై 24 గంటలు పోలీసులు వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.