హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): జడ్పీ ఎన్నికలను ఈవీఎంలు ద్వారా నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (టీజీఎస్‌ఈసీ) ఐ రాణికుముదిని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా ఈవీఎంలు సరఫరా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదిస్తామని తెలిపారు.
మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని శుక్రవారం సందర్శించారు. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల లెకింపు సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా కమిషనర్ రాణి కుముదిని ఆమెకు వివరించారు.