Peddi Sudarshan Reddy | వెంటిలేటర్‌పైనే పెద్ది సుదర్శన్ రెడ్డి.. హెల్త్ బులెటిన్ విడుదల..!
Peddi Sudarshan Reddy: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy)కి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి(Yashoda Hospital) వైద్యులు తెలిపారు.
Peddi Sudarshan Reddy: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy)కి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి(Yashoda Hospital) వైద్యులు తెలిపారు. హఠాత్తుగా గుండెపోటుకు గురై వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రిలో సీపీఆర్ అనంతరం యశోదలో చేరిన ఆయనకు అందిస్తున్న ట్రీట్మెంట్ వివరాలను డాక్టర్లు వెల్లడించారు. మంగళవారం పెద్ది హెల్త్ బులెటిన్ ప్రకటిస్తూ.. అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో నిపుణుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారీ పల్నొనరీ ఎంబోలిజంతో షాక్‌కు గురైనందున సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనకు వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం పెద్దిని యశోదకు తరలించారు. సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ CPR, ACLS నిర్వహించి గుండె స్పందన పునరుద్ధరించాం. (ROSC). వరంగల్‌లో థ్రాంబోలైసిస్ చికిత్స అందించారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి
వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నామని పేర్కొన్నారు.
తక్కువ మోతాదులో మందులతో పెద్ది రక్తపోటు, ఇతర కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలానే ఆయన శ్వాసక్రియ ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతోనే కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మాటలకు, నొప్పి ఉద్దీపనలకు అర్థవంతమైన న్యూరాలజికల్ స్పందన లేదని తెలిపారు.
EEG, MRI బ్రెయిన్, CT స్కాన్లలో మెదడుకు ఆక్సిజన్ లోపం (Anoxic Brain Damage) సూచించే లక్షణాలు కనిపించాయని, 72 గంటల న్యూరాలజికల్ రీ-అసెస్మెంట్ జూలై 29, బుధవారంరేపు నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు. రీ-అసెస్మెంట్ అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని హెల్త్ బులెటిన్‌లో వైద్యులు స్పష్టం చేశారు. పెద్ది ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నామని యశోదా ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

