Wriddhiman Saha : భారత మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆరు నెలల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు త్వరలోనే కోచ్‌గా అవతారం ఎత్తనున్నాడు. దేశవాళీలో, ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సాహా బెంగాల్ అండర్ -23 జట్టుకు కోచ్‌గా సేవలందించనున్నాడు. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా చెరగని ముద్రవేసిన అతడితో ఒప్పందం చేసుకునేందుకు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆసక్తి కనబరుస్తోంది. అయితే.. బీసీసీఐ, క్యాబ్ మాజీ అధ్యక్షుడు, సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) నుంచి అతడికి పోటీ ఎదురవుతోంది.
‘అండర్ -23 జట్టుకు కొత్త కోచ్ కోసం వెతుకున్నాం. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం క్యాబ్ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రస్తుతానికి కోచ్ పదవికి వృద్ధిమాన్ సాహా పేరు పరిశీలనలో ఉంది. అయితే.. సౌరభ్ గంగూలీ, పంకజ్ రాయ్‌లు కూడా రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టేది ఎవరు? అనేది త్వరలోనే తెలియనుంది’ అని క్యాబ్ సీనియర్ అధికారి తెలిపాడు.
బ్యాటర్, వికెట్ కీపర్ అయిన సాహా భారత జట్టు తరఫున 40 టెస్టు మ్యాచ్‌లు, 9 వన్డేలు ఆడాడు. 2021లో జట్టుకు దూరమైన సాహా ఆ తర్వాత ఐపీఎల్‌కే పరిమితం అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తరఫున విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన అతడిని 18వ సీజన్‌కు ముందు గుజరాత్ వదిలించుకుంది. రంజీ ట్రోఫీలో బెంగాల్ లీగ్ దశలోనే నిష్క్రమించడంతో జనవరిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడీ బెంగాల్ స్టార్.
A special and emotional farewell 🫂
Guard of honour and felicitation for Bengal wicketkeeper-batter Wriddhiman Saha who is playing his final First-class match 👏👏#RanjiTrophy | @IDFCFIRSTBank | @Wriddhipops
Scorecard ▶️ https://t.co/GAuG6Mqk8H pic.twitter.com/DGCJRh4QWT
— BCCI Domestic (@BCCIdomestic) January 31, 2025
నెల తిరగకుండానే… ఫిబ్రవరిలో మూడు ఫార్మట్ల నుంచి వీడ్కోలు పలికాడీ వెటరన్ ప్లేయర్. అనంతరం కోచింగ్ మీద దృష్టి సారించిన సాహా యువతకు మెలకువలు నేర్పిస్తున్నాడు. అందుకే.. అండర్ -23 జట్టుకు క్యాబ్ అతడిని కోచ్‌గా నియమించాలనే ఉద్దేశంతో ఉంది. ఇకపోతే.. సీనియర్ జట్టుకు మాజీ కెప్టెన్ లక్ష్మీ రతన్ శుక్లా ప్రధాన కోచ్‌గా, అండర్ -19 జట్టుకు స్పిన్నర్ సౌరాశిష్ లహిరి కోచ్‌గా వ్యవహరించనున్నారు.