Animesh Kujur : క్రికెట్.. హాకీ.. బ్యాడ్మింటన్.. నీరజ్ చోప్రా (Neeraj Chopra) రాకతో ఈమధ్య కాలంలో జావెలిన్ త్రోలో భారతదేశం పేరు విశ్వవేదికపై మార్మోగిపోతోంది. కానీ, అథ్లెటిక్స్‌లో మాత్రం ఆసియా క్రీడల వరకే మనోళ్ల విజయాలు పరిమితం అయ్యాయి. కరణం మల్లీశ్వరీ, పీటి ఉష.. అంజూ బీజార్జ్.. కుంజరాణి వంటి వారు దేశ ప్రతిష్టను పెంచినా.. ఆ తర్వాతి తరం వీళ్ల వారసత్వాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. అవినాష్ సబ్లే, పరుల్ చౌదరీ, జ్యోతి ఎర్రాజీలు ఫర్వాలేదనిపిస్తున్నా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీద చిరుతాల పరుగెత్తి పతకాలు కొల్లగెట్టే అథ్లెట్లు కరువయ్యారు. అయితే.. అనిమేశ్ కుజుర్ (Animesh Kujur) రూపంలో భారత్‌కు ‘ఉసేన్ బోల్ట్’ లాంటి పరుగుల వీరుడు దొరికాడు.
బుల్లెట్ వేగంతో దౌడు తీస్తూ జాతీయ స్థాయిలో రికార్డులు బద్ధలు కొడుతున్న ఈ యువకెరటం.. టోక్యోలో జరుగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిక్స్ మీద గురి పెట్టాడు. ఈ పోటీలకు అర్హత సాధించాడంటే అనిమేశ్ చరిత్ర సృష్టించడం ఖాయం. ట్రాక్ మీద రాకెట్ వేగంతో దూసుకెళ్లే అనిమేశ్ కుజుర్ది ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల గ్రామం. ఆరడుగుల రెండు అంగుళాల పొడవుండే ఇతడు టీనేజ్ నుంచే తన స్పీడ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈమధ్యే 100 మీటర్ల దూరాన్ని 10.18 సెకన్లలో చేరుకొని చరిత్ర సృష్టించాడు. తద్వారా గురిందెర్విర్ (10.20 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్ధలు కొట్టి ది ‘ఫాస్టెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా అవతరించాడు అనిమేశ్.
Animesh Kujur sets a new 🇮🇳 NR in the men’s 100m. He clocks 10.18 to win his heat at the Dromi International Sprint and Relays in Vari, Greece. He erases the old mark of 10.20 set by Gurindervir Singh. He also shaves nearly .10 seconds off his own previous best of 10.27 pic.twitter.com/nQ4US5Hq1x
— jonathan selvaraj (@jon_selvaraj) July 5, 2025
22 ఏళ్లకే దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా మారిన అతడు ఈమధ్యే మొనాకో డైమండ్ లీగ్‌లో పోటీపడ్డాడు. అండర్ -23 విభాగంలో 200 మీటర్ల పరుగులో ఆస్ట్రేలియా స్టార్ గౌట్ గౌట్‌తో ‘నువ్వానేనా’ అన్నట్టు పరుగు తీసి ఔరా అనిపించాడు అనిమేశ్. అయితే.. సెకన్లో పదో వంతుతో పోడియం మీద నిల్చొనే అవకాశం కోల్పోయాడు. అయినా సరే.. అతడేమీ నిరాశకు లోనవ్వడం లేదు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో అంతర్జాతీయ వేదికలపై భారతీయ జెండాను రెపరెపలాడించేందుకు మరింత గట్టిగా ప్రయత్నించేందుకు సిద్దమవుతున్నాడీ యంగ్ అథ్లెట్.
ప్రస్తుతానికి సెప్టెంబర్‌లో టోక్యో వేదికగా జరుగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ టోర్నీని లక్ష్యంగా పెట్టుకున్నాడు అనిమేశ్. తన వేగంతో నేను కచ్చితంగా క్వాలిఫై అవుతాను కోచ్. మీరు ఏమీ కంగారు పడకండి అని అనిమేశ్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.
𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐟𝐚𝐬𝐭𝐞𝐬𝐭 𝐢𝐬𝐧’𝐭 𝐬𝐥𝐨𝐰𝐢𝐧𝐠 𝐝𝐨𝐰𝐧 – 𝐡𝐞’𝐬 𝐥𝐞𝐯𝐞𝐥𝐥𝐢𝐧𝐠 𝐮𝐩. 💪
Animesh Kujur gearing up for Diamond League 2025, Monaco.#RFSports #Letsplay #AnimeshKujur pic.twitter.com/8TbdrOlUJ8
— RelianceFoundationSports (@RFYouthSports) July 11, 2025