Ukraine PM | ఉక్రెయిన్ నూతన ప్రధాన మంత్రి (Ukraine PM)గా యూలియా స్వైరైదెకో (Yuliia Svyrydenko) నియమితులయ్యారు. అంతకు ముందు ప్రధానిగా ఉన్న డెనిస్ ష్మిహాల్ (Denys Shmyhal) మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మార్చి 4, 2020న ప్రధాని బాధ్యతలు స్వీకరించిన డెనిస్ దాదాపు ఐదేళ్లకు పైగానే ఆ పదవిలో కొనసాగారు. అయితే, అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelenskyy) ప్రభుత్వంలో గణనీయమైన భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నారు.
ఇందులో భాగంగానే డెనిస్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆయన తన రాజీనామా లేఖను అధ్యక్షుడికి పంపారు. ఆయన రాజీనామాతో ప్రస్తుతం ఉక్రెయిన్ ఉప ప్రధానిగా, మహిళా ఆర్థికమంత్రిగా ఉన్న యూలియా స్వైరైదెకోను ప్రధానిగా జెలెన్స్కీ ప్రతిపాదించారు. ఇప్పుడు ఆమెను అధికారికంగా ప్రకటించారు. యూలియా.. జెలెన్స్కీకి సన్నిహితురాలు. సుదీర్ఘకాలం నుంచి మంచి మిత్రురాలు కూడా. ఆమె అమెరికా, ఉక్రెయిన్ ఖనిజ ఒప్పందం చర్చల్లో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు పశ్చిమ దేశాల మిత్రులతో జరిగిన పలు ఉన్నతస్థాయి చర్చల్లోనూ ఈమె చురుగ్గా వ్యవహరించారు.
Also Read..
soldiers killed | ఆర్మీ బస్సు లక్ష్యంగా దాడి.. 29 మంది మృతి
Intel | 5 వేల మందిని తొలగిస్తున్నాం.. లేఆఫ్స్ ప్రకటించిన ఇంటెల్
Donald Trump: పాకిస్థాన్లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్