soldiers killed | పొరుగు దేశం పాకిస్థాన్ (pakistan)లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) మరోసారి రెచ్చిపోయింది. క్వెట్టా (Quetta), కలాట్ (Kalat)లో వరుస దాడులు చేపట్టింది. పాకిస్థాన్ ఆర్మీ ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడింది. ఐఈడీతో పేల్చేసింది. ఈ దాడిలో 29 మంది పాక్ సైనికులు (soldiers killed) ప్రాణాలు కోల్పోయారు. దాడి సమయంలో బస్సులో ఆర్మీ సిబ్బందితోపాటు స్థానికులు సహా మొత్తం 48 మంది ఉన్నారు. ఈ దాడికి బీఎల్ఏ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది.
కాగా, పాక్‌లో వేర్పాటువాదులు (BLA attack) మళ్లీ పంజా విసురుతున్నారు. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవలే వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్లు, రైల్వేలైన్లు, వాహనాలపై దాడులు చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ దాదాపు 286 దాడులు నిర్వహించింది. ఆరు నెలల్లో జరిపిన ఈ దాడుల్లో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బలూచ్ ఆర్మీ స్వయంగా ప్రకటించింది.
Also Read..
Intel | 5 వేల మందిని తొలగిస్తున్నాం.. లేఆఫ్స్ ప్రకటించిన ఇంటెల్
DNA: ముగ్గురి డీఎన్ఏతో శిశువుల జననం.. ఐవీఎఫ్ కొత్త టెక్నిక్‌తో వంశపారంపర్య వ్యాధులు దూరం
Satyajit Ray | సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి విషయంలో వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్..!